Omicron : వేగంగా విస్తరిస్తున్న మహమ్మారి.. వారంలోనే 50 లక్షల కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొన్ని దేశాల్లో లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది.

Corona 11zon

Omicron Variant : ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కొన్ని దేశాల్లో లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తున్న వేళ పలుదేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇలా డిసెంబర్ 20 నుంచి 26 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల కొత్త కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇదే సమయంలో కరోనాతో 44,000 మంది మృతి చెందినట్లుగా తెలిపింది. డిసెంబర్ 14 నుంచి 20 వరకు నమోదైన కేసులతో పోల్చితే.. 11 శాతం పెరిగాయని వెల్లడించింది డబ్ల్యూహెచ్ఓ.

చదవండి : Omicron : ఒమిక్రాన్‌కు డెల్టాకంటే స్పీడెక్కువ.. లైట్ తీసుకోవద్దు – WHO

కరోనా కేసులు అమెరికాతోపాటు యూరోప్ దేశాల్లో అధికంగా నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే ఇక్కడ 2 లక్షల కొత్త కేసులు వెలుగు చూశాయి. ఇలా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేస్తోంది. గత వారం నమోదైన 50 లక్షల కేసుల్లో 28 లక్షల కేసులు యూరోప్ దేశాల్లోనే ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇక్కడ పాజిటివిటి రేటు అధికంగా అధికంగా ఉంది. గత వారంతో పోల్చితే 3 శాతం పెరిగింది. ఇక పాజిటివ్ కేసులు ప్రతి లక్షమందిలో 304.6గా నమోదవుతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇక అమెరికాలో కేసుల తీవ్రత అధికంగా ఉంది. గత వారంలో 14.8 లక్షల కేసులు నమోదైనట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. గత వారం ఆఫ్రికా దేశాల్లో 2 లక్షల 75 వేల కరోనా కేసులు నమోదు కాగా.. 7 శాతం కొత్త కేసులు పెరిగినట్లు తెలుస్తోంది.

చదవండి : Covavax : భారత్ లో మరో కోవిడ్ వ్యాక్సిన్..అత్యవసర వినియోగానికి WHO అనుమతి

ఇక డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తుందని తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అయితే దక్షిణాఫ్రికా, డెన్మార్క్, యూకేల నుంచి వస్తున్న సమాచారం చూస్తే ఒమిక్రాన్ బారినపడిన వారు ఆసుపత్రి బారినపడే అవకాశం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోందని పేర్కొంది డబ్ల్యూహెచ్ఓ. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా.. మరణాలు మాత్రం 4 శాతం తగ్గాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.

50 million new corona cases on weekdays worldwide