Omicron : ఒమిక్రాన్‌కు డెల్టాకంటే స్పీడెక్కువ.. లైట్ తీసుకోవద్దు – WHO

కరోనావైరస్ లేటెస్ట్ వేరియంట్ ఒమిక్రాన్ డెల్టా కంటే వేగంగా దూసుకెళ్తుంది. కొవిడ్ మహమ్మారి నుంచి జాగ్రత్త కోసం రెండు డోసులు తీసుకున్న వారిలోనూ ఇన్ఫెక్షన్ ప్రభావం కనిపిస్తుందని...

Omicron : ఒమిక్రాన్‌కు డెల్టాకంటే స్పీడెక్కువ.. లైట్ తీసుకోవద్దు – WHO

Omicron Variant

Omicron Covid Variant: కరోనావైరస్ లేటెస్ట్ వేరియంట్ ఒమిక్రాన్ డెల్టా కంటే వేగంగా దూసుకెళ్తుంది. కొవిడ్ మహమ్మారి నుంచి జాగ్రత్త కోసం రెండు డోసులు తీసుకున్న వారిలోనూ ఇన్ఫెక్షన్ ప్రభావం కనిపిస్తుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) సోమవారం వెల్లడించింది.

WHO ఛీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ.. ప్రాథమికంగా కనిపిస్తున్న పరిస్థితులు చూసి అంచనా వేయడం తెలివితక్కువతనమని అన్నారు. ‘కేసులు పెరుగుతున్న కొద్దీ.. ఆరోగ్య వ్యవస్థల్లో ఆందోళన కనిపిస్తుంది’ అని సౌమ్య స్వామినాథన్ జెనెవా కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులతో అన్నారు.

వేరియంట్ ఇమ్యూన్ సిస్టమ్ మీద పనిచేస్తుండటంతో చాలా దేశాల్లో బూస్టర్ డోసులకు మొగ్గు చూపుతున్నారు. అయితే బలహీనమైన ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వారికి తప్పనిసరి అనే రీతిలో ఫీల్ అవుతున్నారు.

…………………………………. : నేడు తణుకులో సీఎం జగన్ పర్యటన

‘ఈ డేటాను బట్టి చూస్తుంటే ఒమిక్రాన్ అనేది డెల్టా వేరియంట్ కంటే అత్యంత వేగంగా వ్యాప్తిస్తుందని తెలుస్తుంది. కాకపోతే కొవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్లు లేదా రీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్లలో రికవరీ శాతం ఎక్కువగా కనిపిస్తుంది’ అని WHO డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ ఘిబ్రెసస్ చెప్పారు.

అంతేకాకుండా కొవిడ్ బారిన పడకుండా ఉండేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘ఒక ఈవెంట్ క్యాన్సిల్ చేసుకోవడమంటే మీ లైఫ్ ఈవెంట్ క్యాన్సిల్ కాకుండా ఉండటమే’ అని చెప్తున్నారు టెడ్రోస్. ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని హతమార్చిన వైరస్ మరో వేవ్ కోసం పొంచి ఉందని హెచ్చరించారు.

……………………………… : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదు : కేంద్రం