Visakha Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదు : కేంద్రం

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, విపక్షాలు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Visakha Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదు : కేంద్రం

Steel Plant

Visakhapatnam Steel Plant privatization : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వైఖరి మారలేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వల్లే ఉపయోగమని మరోసారి స్పష్టం చేసింది. దీనిపై వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి డాక్టర్ భగవత్ కిషన్‌రావ్ కరాడ్ ప్రైవేటీకరణ తప్పదంటూ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, విపక్షాలు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా డిసెంబర్ 12న పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్ష చేపట్టారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన నిరసన దీక్ష చేపట్టారు.

CM Jagan : నేడు తణుకులో సీఎం జగన్ పర్యటన

విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికుల ఆందోళన 300 రోజులకు పైగా సాగుతోందని.. వారికి నైతికంగా మద్దతిచ్చేందుకు పవన్‌ దీక్ష చేపట్టినట్లు జనసేన వర్గాలు తెలిపాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చేపట్టిన దీక్షకు వచ్చిన ప్రతిఒక్కరికి పవన్ ధన్యవాదాలు తెలిపారు. సమస్య వచ్చినప్పుడు జనసేన గుర్తొస్తుంది… ఓటేసేటప్పుడు జనసేన గుర్తుకు రావాలి కదా అని అన్నారు.

జనసేన పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి ఏ పదవి ఆశించలేదని చెప్పారు. గాజువాకలో ఓడినా.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోరాడుతున్నామని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం జగన్‌ స్పందించాలని దీక్ష సందర్భంగా పవన్ డిమాండ్‌ చేశారు.