Old Man Dance Goes Viral
40 ఏళ్లు రాగానే ఇప్పుడు రకరకాల అనారోగ్య సమస్యలు మొదలవుతున్నాయి. రకరకాల ఒత్తిడిల మధ్య మనుష్యులు యాక్టివ్‌గా ఉండలేకపోతున్నారు. కానీ కొంతమంది పెద్దవాళ్లని (Old man) చూస్తే ఆహారం, ఆరోగ్యం విషయంలో వాళ్లు పాటించిన నియమాలు ఇప్పటి తరం వాళ్లు పాటించట్లేదు అనిపిస్తుంది. వయసు వారికి జస్ట్ నంబర్ మాత్రమే అన్నట్లు 90లలో పడ్డా యాక్టివ్‌గా ఉండగలుగుతున్నారు. 96 ఏళ్ల ఓ పెద్దాయన రీసెంట్‌గా జరిగిన ఓ వెడ్డింగ్‌లో ఎంత యాక్టివ్ గా ఉన్నాడో చూడండి.
పెళ్లిళ్లలో సంగీత్‌లు అందరూ కలిసి సందడిగా డ్యాన్స్ చేయడాలు ఇప్పుడు అన్నిచోట్లా కామన్ అయిపోయాయి. కొంతమంది పెళ్లిళ్లలో తమ సంప్రదాయపు నృత్యాలు చేస్తుంటారు. అలా పెళ్లి సంబరాలు జరుపుకుంటారు. తాజాగా ఓ 96 వృద్ధుడు మనవడి పెళ్లిలో చేసిన డ్యాన్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది. నేపాల్‌లో (Nepal) జరిగిన ఈ పెళ్లి వేడుకలో ఈ పెద్దాయన బాగా హైలైట్ అయ్యాడు. లేచి కూర్చోవడానికి, నడవడానికి కూడా ఇబ్బంది పడే వయసులో ఎంతో యాక్టివ్ గా స్టెప్పులు వేస్తున్న ఈ ముసలాయనని చూసి పెళ్లికి వచ్చిన వారంతా చూసి ముచ్చట పడ్డారు. ఈ వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా, సంతోషంగా ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అంటున్నారు. ఇక ఈ వీడియో everythingaboutnepal అనే ఇన్‌స్టా పేజ్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.
Divorce photoshoot : విడాకుల ఫోటో షూట్‌తో వైరల్ అవుతున్న అమ్మడు.. ఫోటోలు చూస్తే షాకవుతారు
పెద్దాయన డ్యాన్స్ భలే చేస్తున్నారు అని కొందరు.. స్టెప్పులు బాగా వేస్తున్నారు అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు. వయసు పెరిగే కొద్దీ ఇంక ఎందుకు పనికిరాం అని కొందరు నిరాశలోకి కూరుకుపోతారు. ఎప్పుడూ సరదాగా ఉండేవారు ఎంత వయసు పెరిగినా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండగలుగుతారు. అందుకు ఈ పెద్దాయనే నిదర్శనం.