ప్రపంచంలోనే ఫస్ట్ : 90ఏళ్ల బామ్మకు ఫైజర్ టీకా

  • Publish Date - December 8, 2020 / 03:11 PM IST

కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది.. ఫైజర్, బయోంటెక్ అభివృద్ధి చేసిన ఫైజర్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. బ్రిటన్‌లో సాధారణ ప్రజలకు వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. అందరికంటే ముందుగా ఫస్ట్ ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకుంది బ్రిటన్ బామ్మ. ప్రపంచంలోనే ఫస్ట్ ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్న మొదటి వ్యక్తిగా 90ఏళ్ల బామ్మ Margaret Keenan నిలిచింది.



సెంట్రల్ ఇంగ్లాండ్, కావెంట్రీలోని స్థానిక ఆస్పత్రిలో మంగళవారం ఉదయం 6.31 గంటలకు కీనన్ మొదటి టీకాను వేయించుకుంది. 91ఏళ్లలోకి అడుగుపెట్టడానికి ఒకరోజు ముందే ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకోవడం విశేషం. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మొదటి వ్యక్తిగా గర్వకారణంగా ఉందన్నారు.



సాధారణ ప్రజలకు కరోనా టీకా అందిస్తున్న మొదటి వెస్ట్రన్ కంట్రీగా నిలిచిన బ్రిటన్‌ ఈ రోజు నుంచే వ్యాక్సినేషన్ ప్రారంభించింది. కరోనా మహమ్మారితో పోరాడేందుకు ప్రపంచానికి భారీ మొత్తంలో వ్యాక్సినేషన్ అందించాల్సిన అవసరం ఉంది.



కరోనా దెబ్బకు ఇప్పటికే అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. 1.5 మిలియన్ల కంటే ఎక్కువగా వైరస్ బారినపడి మృతిచెందారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫైజర్ వ్యాక్సిన్‌కు అల్ట్రా కోల్డ్ స్టోరేజీ, లాజిస్టిక్స్ తగినంత లేనప్పటికీ పరిమితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.

90ఏళ్ల (Margaret Keenan) బామ్మ ఎవరంటే?:
90ఏళ్ల బామ్మ Margaret Keenan.. కావెంట్రీ నుంచి జ్యయెలరీ అసిస్టెంట్‌గా రిటైర్డ్ అయ్యారు. వచ్చే వారమే బామ్మ 91ఏళ్లలోకి అడుగుపెట్టబోతున్నారు. బామ్మకు ఒక కుమార్తె, ఒక కొడుకు, నలుగురు మనవడు, మనవరాళ్లు ఉన్నారు. వాస్తవానికి బామ్మ నార్తరన్ ఐర్లాండ్‌లోని Enniskillenలో జన్మించారు. వెస్ట్ మిడ్ ల్యాండ్ లోని కావెంట్రీలో 60ఏళ్లకు పైగా నివాసిస్తోంది.



యూకేలో 50 ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. 80ఏళ్లు ఆపైబడినవారికి కరోనా టీకా అందిస్తున్నారు. వారిలో ఆస్పత్రిలో చేరినవారితో పాటు ఇంట్లోనే ఉన్నవారికి టీకా అందిస్తున్నారు. వీరిలో నర్సింగ్ హోం వర్కర్లకు కూడా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. బామ్మ మార్గారెట్ 90ఏళ్ల వయస్సు కావడంతో ఆమెకు కావెంట్రీ యూనివర్శిటీ ఆస్పత్రిలో కరోనా టీకా వేయించుకున్నారు.