Grandma Makeup..Ex boyfriends funeral : మాజీ ప్రియుడు అంత్యక్రియలకు జబర్ధస్త్‌గా మేకప్ అయిన 92 ఏళ్ల బామ్మ
మాజీ బాయ్‌ఫ్రెండ్ అంత్యక్రియల కోసం 92 ఏళ్ల బామ్మ మంచిగా రెడీ అయ్యింది. ఆ బామ్మ వయస్సు 92 రెండేళ్లు. మాజీ ప్రియుడు అంత్యక్రియలకు వెళ్లటానికి చక్కటి డ్రెస్ వేసుకుంది.లిప్ స్టిక్ వేసుకుని చక్కగా మేకప్ అయ్యింది

92 Years old grandma makeup for ex boyfriends funeral
grandma makeup for ex boyfriends funeral : మాజీ బాయ్‌ఫ్రెండ్ అంత్యక్రియల కోసం 92 ఏళ్ల బామ్మ మంచిగా రెడీ అయ్యింది. ఆ బామ్మ వయస్సు 92 రెండేళ్లు. పేరు డ్రోనియక్. మాజీ ప్రియుడు అంత్యక్రియలకు వెళ్లటానికి చక్కటి డ్రెస్ వేసుకుంది.లిప్ స్టిక్ వేసుకుని చక్కగా మేకప్ అయ్యింది తన మాజీ ప్రియుడు చనిపోతే బాధపడుతు కూర్చోకుండా అంత్యక్రియలకు వెళ్లటానికి రెడీ అయ్యింది.అంతేకాదు చక్కగా మేకప్ కూడా వేసుకుంది.ప్రత్యేకమైన రిచ్ డ్రెస్ వేసుకుంది. డ్రెస్‌తో ముస్తాబై మేకప్ చేసుకుంటున్న వీడియోను బామ్మ డ్రోనియక్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్‌గా మారింది. ఈ 92 ఏళ్ల బామ్మ వీడియోలో తాను 92 ఏళ్ల మహిళా సెలబ్రిటీని అంటూ పరిచయం చేసుకున్నారు.
ఈ క్లిప్‌లో బామ్మ తన మాజీ బాయ్‌ఫ్రెండ్ బ్రూస్ అంత్యక్రియలకు వెళ్లటానికి మేకప్ చేసుకుంటూ..ముఖంపై పౌడర్ రాసుకుని లిప్‌స్టిక్ పెట్టుకుంటూ కనిపించారు. తాను ఎక్కువ మేకప్ వేసుకోవాలనుకోవడం లేదని, తానే అందరి దృష్టిని ఆకర్షించాలని అనుకోవడం లేదని ఆమె చెప్పుకొచ్చారు. నేను బ్రూస్ (మాజీ ప్రియుడు) అంత్యక్రియల కోసం రెడీ అయ్యానను అంటూ ఆర్ఐపీ బ్రూస్ అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోను లక్షలా మంది వీక్షించగా.. ఓన్లీ టూ సెకండ్స్ లో బామ్మ లిప్‌స్టిక్ ఎలా వేసుకుందో అర్ధం కాలేదని..ఇది అద్భుతం అని ఓ యూజర్ కామెంట్ చేయగా..ఇప్పుడే ఈ బామ్మ ఓ రేంజ్ లో ఉంది మరి అప్పట్లో ఎలా ఉండేవారో..ఓ రేంజ్ లో ఉండేవారేమో అంటూ మరో యూజర్ కామెంట్ చేశారు.
View this post on Instagram