South Africa Covid Cases
Almost 1 lakh Covid deaths IN south africa : కోవిడ్ పుట్టింది చైనాలోని వుహాన్ లో అనే ఆరోపణలు కొనసాగుతున్న క్రమంలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చింది దక్షిణాప్రికాలో. ఈ కొత్త వేరియంట్ దాటికి ప్రపంచ దేశాలు వణికిపోతుంటే..దక్షిణాఫ్రికా ప్రభుత్వం మాత్రం తాపీగా ఉంది. ఎటువంటి ఆంక్షలు విధించటంలేదు. దక్షిణాఫ్రికాలో 12 జనవరి 2022 నాటికి 3,534,131 ఇన్ఫెక్ట్ అవ్వగా..3,298,672 కోలుకోలుకున్నారు. అలాగే కోవిడ్ తో 92,649 మరణాలు సంభవించాయి. పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ..మరణాల రేటు 1,00,000 మార్కుకు చేరుకోవడం ఆందోళనకరంగా ఉంది. అయినా సరే ప్రభుత్వం మాత్రం లాక్ డౌన్ విధించే ప్రసక్తే లేదంటోంది. కనీసం క్వారంటైన ఆంక్షలు కూడా విధించకపోవటం గమనించాల్సిన విషయం.
Also read : Covid-19 In AP : ప్రకాశం జిల్లాలో ఒకే రోజు స్కూ్ల్లో 17 పాజిటివ్ కేసులు
కనీస ఆంక్షలు విధించడానికి బదులు విరుద్ధంగా వ్యవహరిస్తోంది ప్రభుత్వం. కోవిడ్ 19తో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉన్నామంటోంది. అంతేతప్ప లాక్‌డౌన్ కానీ, క్వారంటైన్ ఆంక్షలుగానీ విధించే ప్రసక్తి లేదని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఎందుకంటే ఆంక్షలు విధించినా..లాక్ డౌన్ విధించినా అది పరోక్షంగా ఆర్థిక వ్యవస్థ, జీవనోపాధితో పాటు ఇతర సామాజిక అంశాలపై ప్రభావాన్ని చూపుతుందన్న భయం ప్రభుత్వాన్ని వెంటాడుతోంది.
దీంతో.. ప్రపంచవ్యాప్తంగా విధించిన కోవిడ్ -19 ఆంక్షలను దక్షిణాఫ్రికా మాత్రం లైట్ తీసుకుంటోంది. ఎన్ని కేసులు నమోదు అయినా..కొత్త కేసులు పుట్టుకొస్తున్నా..స్థానికంగా అవి ఆచరణ యోగ్యంకాదని ప్రభుత్వం వెల్లడించింది. తొందరపాటు చర్యలకు పూనుకోకుండా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఆచరణయోగ్యమైన నిర్ణయాలపై ప్రభుత్వం దృష్టి సారించటం గమనించాల్సిన విషయం.
Also read : India Corona: ఒక్కరోజులో దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కొత్త కేసులు
కాగా ఒమిక్రాన్ ను తొలిసారిగా గుర్తించి దక్షిణాఫ్రియా ఈ కొత్త వేరియంట్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపింది. తమ దేశంలో ఈ కొత్త వేరియంట్ సోకినవారు పెద్దగా హాస్పిటల్ లో చేరాల్సిన అవసరం కూడా లేకుండా కోలుకుంటున్నారని తెలిపిన విషయం తెలిసిందే.