Wedding Cake Auction
Widding Cake Auction: బ్రిటన్ నూతన రాజు కింగ్ ఛార్లెస్-3, యువరాణి డయానా దంపతుల వివాహం 1981లో జరిగింది. ఈ వివాహ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. అప్పట్లో 3వేల మందికిపైగా అతిథులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ పెళ్లి వేడుక సందర్భంగా పలువురు కేక్‌లు తెచ్చి దంపతులచేత కట్ చేయించారు. ఈ క్రమంలో గతఏడాది మరణించిన నిగెల్ రికెట్స్ అనే వ్యక్తి ఈ వివాహ వేడుకలో అతిథిగా పాల్గొన్నారు. అతను కేక్ ముక్కను భద్రపర్చాడు. 41ఏళ్లుగా దీనిని ఓ పెట్టెలో ఉంచగా అది చెక్కుచెదరలేదు. ప్రస్తుతం దీనిని ప్రముఖ సంస్థ డోర్ అండీ రీస్ వేలం వేయనున్నట్లు న్యూయార్క్ పోస్టు పేర్కొంది.
World Oldest Cake : 80 ఏళ్లనాటి చాక్లెట్ కేకు..ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా అలాగే..!!
యువరాణి డయానా, కింగ్ చార్లెస్ రాజు వివాహం సమయంలో అధికారికంగా 23 కేకులు తయారు చేయించారు. ఐదు పొరలను కలిగి ఉన్న, ఐదు అడుగుల పొడవు ఉన్న ప్రూట్ కేక్ నుంచి ఈ ముక్కను నిగెల్ రికెట్స్ తీసి భద్రపర్చినట్లు తెలిసింది. అయితే 2014 సంవత్సరంలో డోర్ అండీ రీస్ అనే సంస్థ ఓ కేకు ముక్కను వేలం వేయగా నాడు 1,375 పండ్లు (దాదాపు రూ.1.27లక్షలు) పలికింది. ప్రస్తుతం నిగెల్ రికెట్స్ భద్రపర్చిన కేకు ముక్కను 300 పౌండ్లు (దాదాపు రూ. 27వేలు) నుంచి వేలం మొదలు పెట్టనున్నారు. అయితే, ఈ కేకు ముక్క వేలంలో భారీ ధరకు అమ్ముడు పోతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ప్రిన్సెస్ డయానా, కింగ్ చార్లెస్-3 వివాహం 1981 జూలై 29న జరిగింది. లక్షలాది మంది ఈ వివాహాన్ని అప్పట్లో టీవీల్లో వీక్షించారు. దీనిని ‘శతాబ్దపు వివాహం’ అని కూడా పిలుస్తారు. అయితే, చార్లెస్, డయానా 1992లో విడిపోయారు. నాలుగు సంవత్సరాల ముందు వారు చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు.