బంపరాఫర్… కేవలం రూ.86 కే ఇల్లు

  • Published By: Chandu 10tv ,Published On : October 29, 2020 / 01:35 PM IST
బంపరాఫర్… కేవలం రూ.86 కే ఇల్లు

Updated On : October 29, 2020 / 1:40 PM IST

Italian house : ఇల్లు కొనుక్కోవాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే పెరుగుతున్న ధరలు వింటుంటే సొంత ఇంటి కల నెరవేరుతుందా? అనిపిస్తుంది. సొంత ఇల్లు కట్టుకోవటమంటే మాటలు కాదు. చేతినిండా డబ్బులు ఉండాల్సిందే.కానీ ఇప్పుడా బాధ లేదు కేవలం రూ.86 కే సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. ఏంటీ..రూ.100 పెడితే కిలో కూరగాయలే రావట్లేదు ఏకంగా ఓ ఇల్లు 86 రూపాయలకే ఇల్లు కొనేయొచ్చా?!! ఇదేదో చెవిలో పువ్వు పెట్టే స్కీమ్ అనే డౌట్ కచ్చితంగా వస్తుంది.కానీ ఇది నిజ్జంగా నిజమేనండీ బాబూ..కాకపోతే అది మన ఇండియాలో మాత్రం కాదు. ఇట‌లీలోని స‌లేమీలోని సిసిలీ నగరంలో ఈ రూ.86 రూపాయల ఇల్లు బంఫరాపర్ ప్ర‌క‌టించారు. ఒక్క యూరోకే ఇల్లు తీసుకోండి అంటూ అక్కడి అధికారులు ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డారు.



వివరాల్లోకి వెళ్తే… సిసిలీలో ఎందుకంత చౌకగా ఇల్లును ఇస్తున్నారంటే.. 1968లో అక్కడ సంభవించిన భూకంపం తర్వాత ఆ ప్రాంతామంతా అస్తవ్యస్తంగా తయారైంది. అప్పటి నుంచి అక్కడి ప్రజలు జీవానాధరం కోసం ఇతర ప్రాంతాలకు, నగరాలకు వలస వెళ్లిపోతున్నారు. దీంతో అక్కడ నివసించే జనాభా సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో ఆ ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా మారి దెయ్యాల కొంప‌గా మారుతుందేమో అని అక్కడి అధికారులకు భ‌యం ప‌ట్టుకుంది.



దీంతో అధికారులు ‘ఒక్క యూరోకే ఇల్లు’ విక్రయించే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఒక్క యూరో అంటే భార‌త క‌రెన్సీలో 86 రూపాయ‌లు. ఈ పథకం ద్వారానైన ఆ ప్రాంతం మళ్లీ తిరిగి జనాలతో కళకళలాడేలా చేయవచ్చునని అధికారులు సంబరపడిపోతున్నారు.



పట్టణ మేయర్ డొమెనికో వేణుత్ మాట్లాడుతూ, ఇప్ప‌టికే స‌లేమీలో నివాస‌యోగ్య‌మైన‌ పాత‌ ఇళ్ల‌ను గుర్తించి వాటిని వేలానికి సిద్ధంగా ఉంచామని అన్నారు. అంతేకాకుండా నగరంలోని రోడ్లు, కరెంటు వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఈ పథకాన్ని బ్యూరోక్రాటిక్ సమస్యల కారణంగా ముందే ప్రారంభించలేకపోయాని మేయర్ చెప్పారు. అయితే అక్కడ ఇళ్ల‌ను కొనుగోలు చేసేవారు వాటిని త‌ప్ప‌కుండా రిపేర్లు చేయించాలనే షరతును విధించినట్లు అధికారులు చెప్పారు.