Old Woman
Irmgard Furchner: 97ఏళ్ల మహిళలను జర్మనీ కోర్టు దోషిగా తేల్చింది. ఆమెకు రెండేళ్ల పాటు శిక్షను విధిస్తూ నిర్ణయించింది. ఇమ్‌గార్డ్ ఫర్చ్‌నర్ అనే మహిళకు ప్రస్తుతం 97 సంవత్సరాలు. ఆమె యుక్తవయస్సులో (18-19 ఏళ్లు) ఉన్న సమయంలో 1943 – 45 మధ్య కాలంలో స్టట్టోఫ్ కాన్సంట్రేషన్ క్యాంపులో పనిచేసింది. దశాబ్దాలుగా నాజీ నేరాలకు సహాయం చేసిన అతి కొద్ది మంది మహిళల్లో ఇమ్‌గార్డ్ ఫర్చ్‌నర్ కూడా ఒకరని కోర్టు తేల్చింది. ఆ సమయంలో 10,505 మందిపైగా హత్యలకు ఆమెకు కూడా ప్రమేయం ఉందని తేల్చిన కోర్టు, శిక్ష విధించింది.
Berlin: బెర్లిన్‌లో పేలిపోయిన అతిపెద్ద స్థూపాకార అక్వేరియం.. ఎన్ని లక్షల లీటర్ల కెపాసిటీ అంటే
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ నాజీ సేనల దురాగతాలకు లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. డాన్స్క్ నగరానికి దగ్గరలో ఉన్న స్టట్టోఫ్ కాన్సంట్రేషన్ క్యాంపు ఉంది. ఈ క్యాంపులో అప్పట్లో 65వేల మంది ఖైదీలు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో మరణించారు. వీరిలో బందీలైన సోవియట్ సైనికులతో పాటు, యూదులు, యూదులు కానివారు ఉన్నారు. 1944 జూన్ నుంచి గ్యాస్ చాంబర్లలో వేలాది మందిని చంపేశారు. అయితే ఇమ్‌గార్డ్ ఫర్చ్‌నర్ కు 10,505 మంది హత్యకేసులో పరోక్షంగా ప్రమేయం ఉందని భావించిన కోర్టు శిక్షను విధించింది.
97-year-old woman
విచారణ సమయంలో మాట్లాడిన ఇమ్‌గార్డ్ ఫర్చ్‌నర్.. హత్యలు జరిగిన సమయంలో నేను స్టట్టోఫ్ లో ఉన్నందుకు చింతిస్తున్నాను. అదే నేను చెప్పదలుచుకున్నది అన్నారు. ఇదిలాఉంటే 2021లో విచారణ ప్రారంభమైనప్పుడు.. ఇమ్‌గార్డ్ ఫర్చ్‌నర్ తాను పదవీ విరమణ తర్వాత నివసిస్తున్న ఇంటి నుంచి కూడా కనిపించకుండా వెళ్లిపోయారు. అయితే పోలీసులు ఆమెను హ్యామ్ బర్గ్ లోని వీధిలో గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 1943 – 45 మధ్య కాలంలో కాన్సంట్రేషన్ క్యాంప్ నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని విచారించిన అనంతరం కోర్టు తీర్పు వెలువరించింది. అయితే, రెండో ప్రపంచ యుద్ధం నాటి సుదీర్ఘమైన యుద్ధ నేరాల విచారణలో దీన్ని ఒకటిగా జర్మన్ మీడియా పేర్కొంది.