Elephant In Grocery Store: ఏదో డీమార్ట్, రిలయన్స్ ఫ్రెష్ కి వెళ్లినట్టు ఎలా వెళ్లిందో చూడండి ఏనుగు.. ఫుల్ మీల్స్ లాగించేసింది..

భారీ సైజున్న ఏనుగు సూపర్ స్టోర్ లోకి రావడంతో కస్టమర్లు, షాప్ ఓనర్ షాక్ కి గురయ్యారు. ఆ ఏనుగు ఎక్కడ తమపై దాడి చేస్తుందోనని..

Elephant In Grocery Store: థాయిలాండ్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ భారీ ఏనుగు సూపర్ మార్కెట్ లోకి చొరబడింది. అక్కడ తన కంటికి కనపడ్డ ఆహారాన్ని తినేసింది. ఏకంగా 9 బ్యాగుల స్వీట్ రైస్, సాండ్ విచ్, అరటి పండ్లను లాగేంచిసింది. మ్యాటర్ ఏంటంటే.. ఆ గజరాజుకు బాగా ఆకలేసింది. అంతే.. ఆకలి తీర్చుకోవడానికి ముందుకు కదిలింది. ఈ క్రమంలో దానికి కంటికి ఒక సూపర్ స్టోర్ కనిపించింది. ఇంకేముంది.. ఏదో డీమార్ట్, రిలయన్స్ ఫ్రెష్ కి సరుకులు కొనేందుకు వెళ్లినట్లుగా.. ఆ గ్రాసరీ స్టోర్ లోకి చొరబడిందా ఏనుగు.

అసలే ఆకలితో ఉంది. అంతే.. అక్కడున్న ఆహార పదార్దాలపై దాని కన్ను పడింది. ఆ ఏనుగు తనకు కావాల్సిన ఫుడ్ ని తినేసింది. అక్కడ పలు రకాల ఫుడ్ ఐటెమ్స్ కనిపించినా.. తనకు ఏం తినాలని అనిపించిందో వాటిని మాత్రమే తినిందా గజరాజు. అయితే, గ్రాసరీ స్టోర్ లోకి చొరబడ్డ ఏనుగు.. అక్కడ ఎలాంటి బీభత్సం చేయలేదు. చాలా కామ్ గా వ్యవహరించింది. తన పని తాను చూసుకుంది. ఆహారం తినేసి అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోయింది.

అయితే భారీ సైజున్న ఏనుగు సూపర్ స్టోర్ లోకి రావడంతో కస్టమర్లు, షాప్ ఓనర్ షాక్ కి గురయ్యారు. ఆ ఏనుగు ఎక్కడ తమపై దాడి చేస్తుందోనని భయంతో వణికిపోయారు. ఏనుగును చూడగానే కొందరు అక్కడి నుంచి ప్రాణభయంతో పరుగులు తీశారు. అయితే, ఆ గజరాజు ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టలేదు. తన ఆకలి తీర్చుకుని అక్కడి నుంచి సైలెంట్ గా వెనుదిరిగింది.

Also Read: నీట్ ఆన్సర్ కీ చూసుకున్న తర్వాత గన్‌తో కాల్చుకున్న విద్యార్థి.. భోపాల్‌లో షాకింగ్ ఘటన..

సూపర్ స్టోర్ సమీపంలోనే ఓ పార్క్ ఉంది. అక్కడే ఈ ఏనుగు ఉంటుంది. బాగా ఆకలి వేసిందో ఏమో కానీ.. పార్క్ నుంచి వీధుల్లోకి వచ్చేసింది. అదే సమయంలో దానికొక సూపర్ స్టోర్ కనిపించింది. ఇంకేముంది.. లోనికి వెళ్లి కంటికి కనిపించిన ఆహార పదార్దాలను తినేసింది. వెంటనే విషయం తెలుసుకుని పార్క్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.

ఏనుగును అక్కడి నుంచి బయటకు పంపేందుకు విశ్వప్రయత్నాలే చేశారు. కానీ, ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. గజరాజు అక్కడి నుంచి అస్సలు కదల్లేదు. ఫుల్ మీల్స్ లాగించే వరకు పక్కకు పోలేదు. ఆకలి తీరినట్లు అనిపించిందో ఏమో.. ఆ భారీ ఏనుగు మెల్లగా సూపర్ స్టోర్ నుంచి బయటకు వెళ్లిపోయింది.

భారీ ఏనుగు సూపర్ స్టోర్ లోకి వెళ్లి ఆహార పదార్దాలు తినేసి తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.