Bhopal Tragedy: నీట్ ఆన్సర్ కీ చూసుకున్న తర్వాత గన్‌తో కాల్చుకున్న విద్యార్థి.. భోపాల్‌లో షాకింగ్ ఘటన..
మంగళవారం ఉదయం నీట్ ఆన్సర్ కీ వచ్చింది. దాంతో నీకు ఎన్ని మార్కులు వచ్చాయి అని కుటుంబసభ్యులు నిఖిల్ ని అడిగారు. వెంటనే నిఖిల్ ఆన్సర్ కీని చెక్ చేసుకున్నాడు.

Bhopal Tragedy: భోపాల్ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నీట్ రాసిన విద్యార్థి ఆన్సర్ కీ చూసుకున్న తర్వాత బలవన్మరణం చేసుకున్నాడు. తనను తాను గన్ తో కాల్చుకుని చనిపోయాడు. నిఖిల్ ప్రతాప్ రాతోర్ (18) నీట్ ఎగ్జామ్ రాశాడు. దానికి సంబంధించిన ఆన్సర్ కీ వచ్చింది. మంగళవారం ఆన్సర్ కీని విడుదల చేశారు. తాను ఎన్ని ప్రశ్నలు కరెక్ట్ గా రాశానో తెలుసుకునేందుకు నిఖిల్ ఆ ఆన్సర్ కీ ని చూసుకున్నాడు. అంతే, ఆ తర్వాత అతడు అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లోనే గన్ తో కాల్చుకుని తన ప్రాణాలను తీసుకున్నాడు.
మంగళవారం ఉదయం ఆన్సర్ కీ చూసుకున్న నిఖిల్ రాత్రి బలవన్మరణం చేసుకున్నాడు. నిఖిల్ చాలా బాగా చదువుతాడని, అతడికి బ్రిలియంట్ అకడమిక్ రికార్డ్ ఉందని కుటుంబసభ్యులు తెలిపారు. క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామ్స్ లో అతడు 95శాతం స్కోర్ చేశాడు. అలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ ఇలా ప్రాణాలు తీసుకోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.
మంగళవారం ఉదయం నీట్ ఆన్సర్ కీ వచ్చింది. దాంతో నీకు ఎన్ని మార్కులు వచ్చాయి అని కుటుంబసభ్యులు నిఖిల్ ని అడిగారు. వెంటనే నిఖిల్ ఆన్సర్ కీని చెక్ చేసుకున్నాడు. ఆ వెంటనే బాగా నిరుత్సాహపడిపోయాడు. అతడు అనుకున్న స్కోర్ కంటే తక్కువ స్కోర్ వచ్చింది. దాంతో తీవ్ర ఒత్తిడికి లోనై అతడు కఠినమైన నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు వివరించారు.
Also Read: బీజేడీ నేతను పెళ్లాడిన టీఎంసీ ఎంపీ..? టాప్ సీక్రెట్ గా జరిగిన వివాహం..!
రాత్రి 8గంటల సమయంలో నిఖిల్ ఇంట్లో గన్ తో కాల్చిన శబ్దం వినిపించింది. దీంతో కుటుంబసభ్యులు ఉలిక్కిపడ్డారు. వెంటనే కిందకు పరిగెత్తుకుని వెళ్లారు. అక్కడ నిఖిల్ విగతజీవిగా పడి ఉండటం చూసి షాక్ కి గురయ్యారు. నిఖిల్ తండ్రి రిటైర్డ్ ఆర్మీ అధికారి. ఆయన దగ్గర లైసెన్స్ కలిగున్న పిస్టల్ ఉంది. ఆ పిస్టల్ తోనే నిఖిల్ తనను తాను కాల్చుకుని చనిపోయాడు.
‘నీట్ ఆన్సర్ కీని తనిఖీ చేసిన తర్వాత అతను ఒత్తిడితో కుంగిపోయి ఇలా చేశాడు. అయినప్పటికీ, మా దర్యాప్తు అన్ని కోణాల్లోనూ కొనసాగుతోంది’ అని ఎస్పీ తెలిపారు. మహారాజ్‌పుర పోలీసులు పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిఖిల్ బాగా చదువుతాడు. ఎంతో ఉల్లాసంగా ఉండే కుర్రాడు. అలాంటి వాడు ఇలాంటి పని చేశాడని తెలిసి కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరూ తీవ్ర షాక్‌లో ఉన్నారు. నిఖిల్ మరణంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.