Mahua Moitra Wedding: బీజేడీ నేతను పెళ్లాడిన టీఎంసీ ఎంపీ..? టాప్ సీక్రెట్ గా జరిగిన వివాహం..!
గతంలో డ్యానిష్ ఫైనాన్షియర్ లార్స్ బోరోసన్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత లాయర్ జై అనంత్ దేహద్రాయ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు.

Mahua Moitra Wedding: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా బీజేడీ సీనియర్ నేత పినాకి మిశ్రాను పెళ్లి చేసుకుంది. మే 3న వీరి వివాహం జరిగింది. తమ వివాహాన్ని ఇరువురూ టాప్ సీక్రెట్ గా ఉంచారు. వారిద్దరూ ఎంత సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారంటే.. ఇరు పార్టీలకు చెందిన నాయకులకు కూడా వీరి వివాహం గురించి తెలియదు. కాగా, అటు మొయిత్రా కానీ ఇటు మిశ్రా కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇద్దరూ మౌనంగానే ఉన్నారు.
మహువా మోయిత్రా రెండుసార్లు లోక్ సభ ఎంపీగా ఎన్నికయ్యారు. వెస్ట్ బెంగాల్ లోని కృష్ణానగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఆమె ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. స్వల్ప కాలంలోనే రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. పార్లమెంటులో తనదైన ముద్ర వేశారు. దేనికీ భయపడరని, తన వాయిస్ ను గట్టిగా వినిపిస్తారని గుర్తింపు తెచ్చుకున్నారు.
కాగా, మోయిత్రాకు ఇది రెండో వివాహం. గతంలో డ్యానిష్ ఫైనాన్షియర్ లార్స్ బోరోసన్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత లాయర్ జై అనంత్ దేహద్రాయ్ తో రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆ తర్వాత వారి రిలేషన్ షిప్ ముగిసింది. చట్టపరమైన వివాదాలకు, బహిరంగ ఆరోపణలకు దారితీసింది. 2023 చివరలో పార్లమెంటు నుండి సస్పెన్షన్‌కు దారితీసిన వివాదంలో దేహద్రాయ్‌ను “జిల్టెడ్ ఎక్స్” అని పేర్కొన్నారు మొయిత్రా.
ఇక పినాకి మిశ్రా పూరీ నుండి నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన గతంలో సంగీత మిశ్రా అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతానికి, మొయిత్రా మిశ్రా వివాహం అధికారికంగా ధృవీకరించబడలేదు. కానీ వెలుగులోకి వస్తున్న వారిద్దరి ఫొటోలు, నివేదికలు రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి.