Girl Teaches Pet Cat Treadmill : ట్రెడ్‌మిల్‌పై ఎలా నడవాలో పెంపుడుపిల్లికి నేర్పించిన చిన్నారి.. బుద్ధిగా భలే నేర్చేసుకుందిగా..

ట్రెడ్‌మిల్ ఎలా నడవాలో పెంపుడుపిల్లికి నేర్పించిన చిన్నారి.. బుద్ధిగా భలే నేర్చేసుకుందిగా..

little GirlTeaches Pet Cat Treadmill

GirlTeaches Pet Cat Treadmill : ట్రెడ్‌మిల్‌ పై నడవటం చక్కటి వ్యాయామం అనే విషయం తెలిసిందే. ట్రెడ్‌మిల్‌ పై నడటం అనేది కాస్త జాగ్రత్తగా చేయాలి. లేదంటే బొక్కబోర్లా పడిపోతాం. ఆ తరువాత దెబ్బలు తగలం ఖాయం. అలా తన పెంపుడు పిల్లి కూడా ట్రెడ్‌మిల్‌ పై వాక్ చేయాలనుకుందో చిన్నారి. మరి ట్రెడ్‌మిల్‌ పై ఎలా నడవాలో పిల్లికి తెలియదు కదా..అందుకే ఆ చిన్నారి తన పెంపుడు పిల్లికి ట్రెడ్‌మిల్‌ పై ఎలా నడవాలో నేర్పించింది. అలా ఒకటి రెండు సార్లు చూపించింది. అలా తన బుల్లి యజమానురాలు నేర్పిస్తుంటే శ్రద్ధగా గమనించిందా పెంపుడు పిల్లి. తరువాత కాస్త ట్రై చేసింది.ఆ తరువాత చక్కగా నడిచేసింది కూడా..దీనికిసంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

యోధా 4ఎవ‌ర్ అనే ట్విట్ట‌ర్ ఖాతా షేర్ చేసిన ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కూ 6 ల‌క్ష‌లకు పైగా వ్యూస్ రాబ‌ట్టింది. 49 సెకండ్ల నిడివి క‌లిగిన ఈ వీడియోలో చిన్న పాప ట్రెడ్‌మిల్‌పై వాక్ చేస్తుండ‌టం క‌నిపిస్తుంది. ట్రెడ్‌మిల్‌ పై ఎలా నడవాలో త‌న పెంపుడు పిల్లికి చిన్నారి చూపిస్తుండ‌టం ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది. ఆపై పాప ఎలా నడిచిందో శ్రద్ధంగా గమనించిన ఆ పిల్లి కూడా ట్రెడ్‌మిల్‌పై న‌డ‌వ‌డం చూస్తే భలే నేర్చేసుకుందో అనిపిస్తుంది.

ట్రెడ్‌మిల్‌ పై చక్కగా నడిచేస్తున్న పిల్లిని చూసి చిన్నారి మురిసిపోతూ న‌వ్వులు పూయించింది. ట్రెడ్‌మిల్‌ను ఎలా ఉప‌యోగించాలో పిల్లికి చిన్నారి టీచ్ చేస్తోంద‌ని వీడియోకు క్యాప్ష‌న్‌గా ఇచ్చారు. ఈ పాప భ‌విష్య‌త్‌లో ఫిట్‌నెస్ ఇన్‌స్ట్ర‌క్ట‌ర్ అవుతుంద‌ని ఓ యూజ‌ర్ పేర్కొన్నారు. అలాగే క్యూట్ వీడియోను అసలు మిస్ కావ‌ద్ద‌ని మ‌రో యూజ‌ర్ కామెంట్ చేశారు.