Meteor Shower On Mars : అంగారకుడిపై ఉల్కాపాతం.. ఏర్పడిన భారీ గొయ్యి

సౌర కుటుంబంలో నాలుగో గ్రహమైన అంగారుకుడిపై భారీ ఉల్కాపాతం జరిగింది. గతేడాది డిసెంబరులో అరుణగ్రహంపై ఒక ఉల్క కూలింది. దీంతో అక్కడ భారీ గొయ్యి ఏర్పడింది.

meteor shower on Mars

Meteor Shower On Mars : సౌర కుటుంబంలో నాలుగో గ్రహమైన అంగారుకుడిపై భారీ ఉల్కాపాతం జరిగింది. గతేడాది డిసెంబరులో అరుణగ్రహంపై ఒక ఉల్క కూలింది. దీంతో అక్కడ భారీ గొయ్యి ఏర్పడింది. ఈ ఉల్కాపాతాన్ని నాసాకు చెందిన ఇన్‌సైట్ ల్యాండర్ విన్నదట. దాంతో అక్కడకు చేరుకుని ఫొటోలు తీసుకుంది.

Meteor Shower : ఆకాశంలో వెలుతురు,శబ్ధాలతో…నార్వేలో ఉల్కాపాతం

ఈ ఉల్కాపాతం జరిగిన ప్రాంతంలో సుమారు 150 మీటర్లు వెడల్పు కలిగిన గొయ్యి ఏర్పడింది. ఈ ప్రమాదం వల్ల నాలుగు మాగ్నిట్యూడ్‌తో ఆ ప్రాంతం కంపించిందని నాసా పేర్కొంది. ఈ ఘటనలో భారీ సైజులో ఉన్న మంచు గడ్డలు కూడా ఎగిరిపడినట్లు వెల్లడించింది.