Ukrainian Bomb Attack : యుద్ధ ఖైదీలున్న జైలుపై యుక్రెయిన్ బాంబు దాడి

యుక్రెయిన్ చేసిన బాంబు దాడి వల్ల ఓ జైలులో ఉన్న 53 మంది యుక్రెయిన్ సైనికులు మరణించినట్లు రష్యా మద్దతు గల వేర్పాటువాద సంస్థ చెబుతోంది. ఈ ఘటనలో 130 మంది గాయపడ్డారని సమాచారం. ఒలెనివ్కా పట్టణంలోని జైలుపై యుక్రెయిన్‌ షెల్లింగ్​ జరపగా భారీగా మృత్యువాత పడ్డారు.

Bomb Attack

Ukrainian bomb attack : యుక్రెయిన్ చేసిన బాంబు దాడి వల్ల ఓ జైలులో ఉన్న 53 మంది యుక్రెయిన్ సైనికులు మరణించినట్లు రష్యా మద్దతు గల వేర్పాటువాద సంస్థ చెబుతోంది. ఈ ఘటనలో 130 మంది గాయపడ్డారని సమాచారం. ఒలెనివ్కా పట్టణంలోని జైలుపై యుక్రెయిన్‌ షెల్లింగ్​ జరపగా భారీగా మృత్యువాత పడ్డారు.

యుద్ధ సమయంలో మరియోపోల్‌లోని అజోవ్ ఓడరేవు, స్టీల్​మిల్‌కు రక్షణగా ఉన్న యుక్రెయిన్‌ సైనికులు దాదాపు నెలలపాటు శత్రు సైనికులను దీటుగా అడ్డుకొన్నాయి. చివరకు రష్యా సైన్యానికి లొంగిపోయారు. అప్పటినుంచి ఈ సైనికులను రష్యా మద్దతున్న డొనెట్స్క్​వంటి ప్రాంతాల్లోని జైళ్లలో బంధించారు. ఇప్పుడు యుక్రెయిన్ బాంబు దాడిలో ఆ దేశానికే చెందిన 53 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

Russia Warns Countries : యుక్రెయిన్‌కు సాయం చేస్తే దాడులు తప్పవు- రష్యా సీరియస్ వార్నింగ్

ఈ ఘటనపై యుక్రెయిన్, రష్యా పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. యుక్రెయిన్‌ టార్గెట్‌గానే జైలుపై దాడి చేసిందని ఆరోపించింది రష్యా. తాము రష్యా సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని షెల్లింగ్ జరిపామని యుక్రెయిన్ ప్రకటించింది. రష్యా సేనలే జైలు బాంబు దాడి చేశాయని యుక్రెయిన్ ఆరోపించింది.