Russia Warns Countries : యుక్రెయిన్‌కు సాయం చేస్తే దాడులు తప్పవు- రష్యా సీరియస్ వార్నింగ్

యుక్రెయిన్ కు సాయం అందించే దేశాలకు మరోసారి వార్నింగ్ ఇచ్చింది రష్యా. యుక్రెయిన్ కు సాయం చేస్తే తమ ఆర్మీ చూస్తూ ఊరుకోదని చెప్పింది. మెరుపు వేగంతో దాడులు చేస్తామని హెచ్చరించింది.(Russia Warns Countries)

Russia Warns Countries : యుక్రెయిన్‌కు సాయం చేస్తే దాడులు తప్పవు- రష్యా సీరియస్ వార్నింగ్

Russia Warns Countries

Russia Warns Countries : రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. రెండు నెలలుగా యుక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ కొనసాగిస్తోంది. రష్యా బలగాలు బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. ప్రపంచ దేశాలు కన్నెరజేసినా, కఠినమైన ఆర్ధిక ఆంక్షలు విధించినా.. పుతిన్ మాత్రం తగ్గేదే లే అంటున్నారు. అనుకున్నది సాధించే వరకు యుద్ధం ఆపేది లేదంటున్నారు. కాగా, పలు దేశాలు యుక్రెయిన్ కు సాయం అందిస్తున్నాయి. కొన్ని దేశాలు ఆయుదాలు అందిస్తుంటే, మరికొన్ని ఆర్ధిక సాయం చేస్తున్నాయి. వాటి సాయంతో యుక్రెయిన్ రష్యా సేనలను అడ్డుకుంటోంది. తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఈ క్రమంలో రష్యా సీరియస్ అయ్యింది. యుక్రెయిన్ కు సాయం చేస్తే దాడులు తప్పవని హెచ్చరించింది.

యుక్రెయిన్ దాడులను తీవ్రతరం చేసింది రష్యా. యుక్రెయిన్ ఆర్మీ స్థావరాలే టార్గెట్ గా మిస్సైళ్ల వర్షం కురిపించింది. యుక్రెయిన్ మిలటరీ డిపోను ధ్వంసం చేసింది. యుక్రెయిన్ కు సాయం అందించే దేశాలకు మరోసారి వార్నింగ్ ఇచ్చింది రష్యా. యుక్రెయిన్ కు సాయం చేస్తే తమ ఆర్మీ చూస్తూ ఊరుకోదని తేల్చి చెప్పింది. మెరుపు వేగంతో దాడులు చేస్తామని హెచ్చరించింది. నేరుగా తమ ఆర్మీకే టార్గెట్ కావొద్దంటూ పరోక్షంగా నాటో దేశాలకు వార్నింగ్ ఇచ్చింది.(Russia Warns Countries)

World War Three : మూడో ప్రపంచ యుద్ధం దగ్గరపడింది.. ఆ దేశాలకు రష్యా సీరియస్ వార్నింగ్

అటు యుక్రెయిన్ రైలు మార్గాలను రష్యా టార్గెట్ చేసింది. ఇంధనం, మందుగుండు సామాగ్రి, ఇతర వస్తువులను తరలించేందుకు రష్యాకు యుక్రెయిన్ రైలు మార్గాలు అవసరంగా మారాయి. తమ దళాలను, సైనిక పరికరాలను తరలించడానికి యుక్రెయిన్ రైల్వేలపై రష్యా ఎక్కువగా ఆధారపడుతోంది. ఇక రైల్ నెట్ వర్క్ ఉపయోగించుకుని ప్రధాన నగరాలను స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. డిపోల నుంచి 140కిమీ దాటి యూనిట్లను సమర్థవంతంగా తిరిగి సరఫరా చేయడానికి రష్యా మిలటరీ వద్ద తగినన్ని ట్రక్కులు లేవని సమాచారం.

మరోవైపు యుక్రెయిన్, రష్యా యుద్ధంలో శాంతి స్థాపన కోసం ఐరాస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మొన్న పుతిన్ తో భేటీ అయినా యూఎన్ చీఫ్ గుటెరస్.. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతోనూ భేటీ అయ్యారు. ఇది ఇలా ఉంటే యుద్ధం 64 రోజులకు చేరినా.. ఇప్పటివరకు యుక్రెయిన్ లోని రెండు నగరాలపై తప్ప మిగతా వాటిపై పట్టు సాధించలేకపోయింది రష్యా. దీంతో మిస్సైల్ దాడులను మరింత తీవ్ర తరం చేసింది రష్యా.

Ukrainian Women : యుక్రెయిన్ మహిళలపై రష్యా సైనికుల పైశాచికత్వం.. ఫోరెన్సిక్ నివేదికలో సంచలన నిజాలు..!

కాగా.. రష్యా-యుక్రెయిన్ మధ్య యుద్ధం గురించి యూకే విదేశాంగ సెక్రటరీ లిజ్‌ ట్రస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధం 10 సంవత్సరాల పాటు కొనసాగొచ్చని.. ఈ దాడిలో పుతిన్ విజయం సాధిస్తే.. యూరప్ లో భయంకరమైన దుస్థితి, ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగొచ్చని, అందుకు యూరప్ సిద్ధంగా ఉండాలని లిజ్‌ ట్రస్ హెచ్చరించారు. బ్రిటన్, దాని మిత్ర దేశాలు యుక్రెయిన్ నుంచి రష్యాను వెళ్లగొట్టేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ఈ సంక్షోభం వేళ.. అంతర్జాతీయ భద్రత విషయంలో మార్పులు తెచ్చేలా ముందుకు కదలాలన్నారు.