World War Three : మూడో ప్రపంచ యుద్ధం దగ్గరపడింది.. ఆ దేశాలకు రష్యా సీరియస్ వార్నింగ్

మూడో ప్రపంచ యుద్ధం గురించి రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. భయాలను మరింత పెంచింది. మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి అసలైన ముప్పు..(World War Three)

World War Three : మూడో ప్రపంచ యుద్ధం దగ్గరపడింది.. ఆ దేశాలకు రష్యా సీరియస్ వార్నింగ్

World War Three

World War Three : రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. రెండు నెలలుగా యుక్రెయిన్ పై రష్యా బలగాల దాడులు కొనసాగుతున్నాయి. యుక్రెయిన్ పై బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి రష్యా సేనలు. రష్యా దురాక్రమణపై ప్రపంచ దేశాలు కన్నెరజేశాయి. రష్యాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలు కూడా విధించాయి. అయినా పుతిన్ మాత్రం తగ్గేదేలే అంటున్నారు. అనుకున్నది సాధించే వరకు యుద్ధాన్ని ఆపేది లేదంటున్నారు. మరోవైపు పశ్చిమ దేశాలు యుక్రెయిన్ అండగా నిలుస్తున్నాయి. రష్యాతో పోరాడేందుకు యుక్రెయిన్ కు ఆర్థిక సాయంతో పాటు ఆయుధాల సాయం చేస్తున్నాయి. ఇప్పుడీ వ్యవహారం రష్యాకు కోపం తెప్పించింది. ఈ క్రమంలో మూడో ప్రపంచ యుద్ధం భయాలు నెలకొన్నాయి. రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం థర్డ్ వరల్డ్ వార్ కి దారితీస్తుందా? అనే ప్రశ్నలు ఆందోళకు గురి చేస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే.. మూడో ప్రపంచ యుద్ధం గురించి రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. భయాలను మరింత పెంచింది. మూడో ప్రపంచ యుద్ధానికి సంబంధించి అసలైన ముప్పు ఇప్పుడు ప్రారంభం కాబోతోందని రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. యుక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలను పంపే విషయమై తన మిత్ర దేశాలతో అమెరికా ఈరోజు సమావేశం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా తీవ్ర వ్యాఖ్యలు చేసింది.(World War Three)

Ukrainian Women : యుక్రెయిన్ మహిళలపై రష్యా సైనికుల పైశాచికత్వం.. ఫోరెన్సిక్ నివేదికలో సంచలన నిజాలు..!

ఇప్పటికే పశ్చిమ దేశాల నుంచి యుక్రెయిన్ కు భారీ ఎత్తున ఆయుధాలు, యుద్ధ సామగ్రి అందాయి. వీటితోనే రష్యా సేనలను యుక్రెయిన్ నిలువరించే ప్రయత్నం చేస్తోంది. పెద్ద సంఖ్యలో రష్యా యుద్ధ విమానాలు, ట్యాంకర్లను ధ్వంసం చేసింది. వేలాది మంది రష్యా సైనికులను హతమార్చింది. ఇప్పుడు భారీ ఎత్తున ఆయుధాలను ఉక్రెయిన్ కు పంపాలని అమెరికా, పశ్చిమ దేశాలు నిర్ణయించే అయ్యే పరిస్థితి రావడంతో అణ్వస్త్ర దేశమైన రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనిపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ రష్యన్ మాట్లాడుతూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశాలున్నాయని వార్నింగ్ ఇచ్చారు. ‘ఇది ముమ్మాటికీ నిజం. మా హెచ్చరికలను తక్కువగా అంచనా వేయొద్దు’ అని అన్నారు.

కాగా, రష్యాతో పోరాడేందుకు తమకు శక్తిమంతమైన ఆయుధాలను ఇవ్వాలని పశ్చిమ దేశాలను యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అడుగుతున్నారు. జెలెన్ స్కీ అడుగుతున్న వాటిలో యుద్ధ విమానాలు, భారీ ఫిరంగులు వంటివి ఉన్నాయి. తాజాగా యుక్రెయిన్ కు 700 మిలియన్ డాలర్ల సాయం అందిస్తామని అమెరికా ప్రకటించింది. మరోవైపు నాటో దేశాలు యుక్రెయిన్ కు ఫైటర్ జెట్లను, యుద్ధ సామగ్రిని అందిస్తున్నాయి.(World War Three)

ఇప్పుడు ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలను పంపే దిశగా అమెరికా అడుగులు వేస్తుండటం రష్యాకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. యుద్ధం తీవ్రంగా మారుతుందని హెచ్చరించింది. అసలైన మూడో ప్రపంచ యుద్ధం దగ్గరపడిందని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు పరిస్థితి చేజారే పరిస్థితే వస్తే… అణ్వస్త్రాలను వాడటానికి కూడా రష్యా వెనకడుగు వేయకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే కచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వస్తుందనే భయాందోళనలు నెలకొన్నాయి.

Ukraine Russia War : యుక్రెయిన్ పై కొనసాగుతున్న రష్యా దాడులు.. 26 స్థావరాలు ధ్వంసం

ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగిన విషయం తెలిసిందే. తొలుత ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా చేసుకున్నామని చెప్పిన మాస్కో.. ఆ తర్వాత సాధారణ జనావాసాలపైనా విరుచుకుపడింది. నానాటికీ ఈ యుద్ధం తీవ్రరూపం దాల్చడమే గాక, వేలాది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్‌లోని పలు ప్రధాన నగరాలు రష్యా సేనల బాంబులు, క్షిపణుల దాడుల్లో తీవ్రంగా ధ్వంసం అయ్యాయి.