Facebookని ఎంతగా వాడితే, అంతలా నెగిటీవ్ ఎఫెక్ట్

Facebookని ఎంతగా వాడితే, అంతలా నెగిటీవ్ ఎఫెక్ట్

Updated On : September 28, 2020 / 12:01 PM IST

Facebook Negative Effect: హ్యాపీనెస్‌లో.. సరదాగా Facebook ఓపెన్ చేసి చివరికి దానిపైనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటే దానివల్ల నెగెటివ్ ఎఫెక్ట్ చాలా ఉంటుందని స్టడీ చెప్తుంది. ఫేస్‌బుక్ 2016 డేటా ప్రకారం.. ప్రతి వ్యక్తి రోజుకు యావరేజ్ గా 50నిమిషాల పాటు వారి ప్లాట్ ఫాంపైనే ఉంటున్నాడు. అదే క్రమంలో ఇతర స్టడీలు సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు ఎలాంటి హాని చేస్తున్నాయోనని ఫేస్‌బుక్ కు సంబంధించిన కొన్ని టెక్నిక్స్ ను బయటపడుతున్నాయి.




2013, 2014, 2015 మూడు వేవ్స్‌లలో జరిపిన కొత్త స్టడీలో 5వేల 208 సబ్జెక్టులను ఎంటర్ చేశారు. యూఎస్ పాపులేషన్ శాంపుల్ రిప్రజంటేటివ్ కింద ఒక్కో వేవ్ ఫేస్‌బుక్ యాక్టివిటీని రెండేళ్ల పాటు మానిటర్ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, నికోలస్ ఏ క్రిస్టాకిస్ ఆఫ్ యేల్ యూనివర్సిటీ రీసెర్చర్లు Facebook Negative Effect గురించి పరిశోధనలు జరిపారు.

ఫేస్‌బుక్ ఇంటారక్షన్స్ అనేవి నెగెటివ్ ఎఫెక్ట్ చూపిస్తున్నాయని.. సోషల్ మీడియా వాడకమే జీవితంపై చెడు ప్రభావం చూపిస్తుందని స్టడీ కన్ఫామ్ చెప్పింది. సోషల్ మీడియా లింక్ ను క్లిక్ చేయడం, ఒక స్టేటస్ అప్‌డేట్ చేయడం, లైక్ కొట్టడం, సెల్ఫ్ రిపోర్టెడ్ మెంటల్ హెల్త్ పై ఐదు నుంచి 8శాతానికి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.




ద హార్వార్డ్ బిజినెస్ రివ్యూ రచయితలు శక్యా, క్రిస్టాకిస్ లు మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యాలను కాలిక్యులేట్ చేశారు. దాంతో పాటు క్లిక్స్, లైక్స్, నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్, సైట్ మీద ఎన్నిగంటల పాటు ఉంటారనేది విశ్లేషించారు. శక్యా, క్రిస్టాకిస్ లు ప్రత్యేకించి కొన్ని యాక్టివిటీలు ఫేస్‌బుక్ ఎలా ప్రభావం చూపిస్తుందో వివరించారు.

ఈ స్టడీలు గతంలో ఇన్వెస్టిగేషన్లకు వ్యత్యాసం ఉన్నట్లు తెలిపాయి. ఫేస్ బుక్ పై సమయం గడిపిన వ్యత్యాసాన్ని సూచిస్తున్నాయి. మనిషి-మనిషి ఎదురుపడితే వచ్చే ఎంగేజింగ్ కంటే సోషల్ మీడియాలో కలిస్తేనే ఎక్కువసేపు మాట్లాడుకుంటున్నట్లు గుర్తించారు. ఆన్‌లైన్ ఇంటారక్షన్ల కంటే ఆఫ్‌లైన్ ఇంటరాక్షన్లకే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని స్టడీలు చెబుతున్నాయి.