బాగ్దాదీ వారసుడిని కూడా చంపేశాం: ప్రకటించిన ట్రంప్

  • Publish Date - October 29, 2019 / 03:20 PM IST

ఉగ్రవాద మార్గంలో ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా దాడులకు తెగబడి చివరకు కుక్క చావు చచ్చిన ఐసిస్‌ అంతర్జాతీయ ఉగ్రసంస్థ వ్యవస్థాపకుడు అబు బకర్‌ అల్‌ బాగ్దాదీ వారసుడిని కూడా అమెరికా బలగాలు మట్టుబట్టాయి. మూడేళ్లుగా అమెరికా సైన్యం కన్నుగప్పి దాడులకు పాల్పడిన మోస్ట్‌వాంటెడ్‌ టెర్రరిస్ట్‌ బాగ్దాదీని వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌లోని బరీషా గ్రామంలోని అమెరికా సేనలు మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూగా ప్రకటించారు.

అయితే లేటెస్ట్‌గా అబు బకర్‌ అల్‌ బాగ్దాదీ స్థానాన్ని భర్తీ చేయబోయే ఉగ్రవాది, బాగ్దాదీ వారసుడిని కూడా హతమార్చినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఈ ఆపరేషన్‌ కూడా సక్సెస్ అయ్యినట్లుగా ట్రంప్ వెల్లడించారు. అయితే, ఐసిస్‌ అగ్రనేత స్థానాన్ని భర్తీ చేయబోయిన ఉగ్రవాది పేరును మాత్రం ట్రంప్‌ ప్రకటించలేదు. బాగ్దాదీ స్థానాన్ని ఇతనే భర్తీ చేస్తాడని నిఘా వర్గాల సమాచారం మేరకు ఆయనను అమెరికా సైన్యం మట్టుబెట్టినట్లు ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.

మూడు రోజుల వ్యవధిలోనే ఐసిస్‌ అగ్రనేత స్థానాన్ని భర్తీ చేయబోయే ఉగ్రవాదిని కూడా మట్టుబెట్టడంపై హర్షం వ్యక్తం అవుతుంది.