రా..ఆడుకుందాం : అబ్బాయితో ఏనుగు పిల్ల పరాచికాలు చూడండీ..

  • Publish Date - January 29, 2020 / 06:45 AM IST

మనుషులు కుక్కల తర్వాత అంతగా ప్రేమించగల జంతువు ఏదైనా ఉందంటే అది ఏనుగు మాత్రమే. ఒకసారి వాటితో స్నేహం చేయటం మెుదలుపెడితే ఎంతో ప్రేమిస్తాయి. అలాంటిదే థాయ్ లాండ్ లో ఓ జూ పార్క్ లో కంచెకు పెయింట్ వేస్తున్న వ్యక్తిని ఆటాడిస్తూన్న ఏనుగు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోని గతేడాది థాయ్ లాండ్ లోని చియాంగ్ మైలో షూట్ చేసింది. 

థాయ్ లాండ్ జూ లో ఏర్పాటు చేసిన కంచెకు రంగులు వేస్తున్నాడు డాన్ డయీంగ్‌ అనే పెయింటర్. అతని పెయింట్ వేసే పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇంతలో ఎన్ క్లోజర్ నుంచి ఖున్సుక్ అనే ఏనుగు పిల్ల పెయింట్ వేస్తున్న డయీంగ్‌ చూసింది. కంచె పై నుంచి అతని తన తొండంతో తడుముతుంది. అలా మాటిమాటికి డయీంగ్‌ ని రంగులు వేయ్యనికుండా తన తొండంతో తడుముతుంది.  

డాన్ డయీంగ్‌ మాత్రం అదేమి పట్టించుకోకుండా తన పని చేసుకోని ఇవ్వమని ఏనుగు సైగ చేస్తున్నాడు. కానీ ఏనుగు మాత్రం అతని కంచె పై నుంచి తొండంతో తాకుతూ, కాళ్ల ను పైకి లేపి కంచె నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇక డయీంగ్‌ చేసేదేమి లేక  సరదా కాసేపు ఏనుగు పిల్లతో ఆడుకున్నాడు. ఈ ఫన్నీ వీడియోని ఎంపీ పరిమల్ నత్వానీ తన ట్విట్టర్ లో షేర్ చేశాడు.