Taliban govt : ఆ పార్కులోకి మహిళలు ప్రవేశించకూడదు, బోటింగ్ చేయకూడదు : తాలిబన్ల మరో హుకుం

ఆడపిల్లలు చదువుకోకూడదు. మహిళలు ఉద్యోగం చేయకూడదు, ఆటలు ఆడకూడదు అంటూ అంతులేని ఆంక్షలు విధిస్తున్న తాలిబన్ ప్రభుత్వం తాజాగా మహిళలను ప్రకృతికి కూడా దూరం చేసింది.

Taliban govt

Afghanistan Taliban govt : అప్ఘానిస్థాన్ లో తాలిబన్ల (Afghanistan)పరం అయినప్పనుంచి మహిళలపై దాష్టీకాలు కొనసాగుతునే ఉన్నాయి. అడుగడుగునా మహిళలకు ఆంక్షలే. తాలిబన్లు చెప్పిందే శాసనం చేసిందే చట్టం అన్నట్లుగా కొనసాగుతోంది అప్ఘానిస్థాన్ లో . చదువులపై ఆంక్షలు, ఉద్యోగంపై ఆంక్షలు, జీవనోపాధి కోసం ఏర్పాటు చేసుకున్న బ్యూటీ పార్లర్లపై కూడా నిషేధం విధించారు. ఇలా తాలిబన్ల పాలనలో మహిళల జీవితమే దుర్భరంగా మారిపోతోంది. తాలిబన్ల అరాచకాలను భరించలేక ఎంతోమంది దేశం వదిలిపోయారు. కానీ దేశం వదిలి వెళ్లలేనివాళ్ల జీవితాలు కడు దుర్భరంగా మారాయి. మహిళల హక్కుల హననం కొనసాగుతోంది. దీంట్లో భాగంగానే తాలిబన్ ప్రభుత్వం మహిళలపై మరో హుకుం జారీ చేసింది.

అఫ్ఘానిస్థాన్ లోని జాతీయ పార్కుల్లో (national park)ఒకటైన బండ్-ఈ-అమీర్ (Band-e-Amir national park)లోకి మహిళలు ప్రవేశించకూడదని హుకుం జారీ చేశారు. ఈ పార్కు అప్ఘానిస్థాన్ రాజధాని కాబూల్ కు పశ్చిమాన 175కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పార్కు చుట్టు ఎతైన శిఖరాలతో చుట్టుముట్టి ఉంటుంది. అంతేకాదు నీలిరంగు సరస్సులకు ఈ పార్కు ప్రసిద్ది చెందింది. ఈ సరస్సుల్లో బోటింగ్ చేయటం ఓ అద్భుతమైన అనుభూతినిస్తుంది. బండ్-ఈ-అమీర్ పార్క్ అందాలకు నెలవు. నీలి రంగు సరస్సులు, ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణాలు, ప్రకృతి సహజమైన అందాలు ఉన్న ఈ పార్కు యునెస్కో గుర్తింపు పొందింది. అటువంటి ఈ పార్కుకు వారంతంలో సందర్శకులు భారీగా తరలి వస్తుంటారు. అటువంటి పార్కులో మహిళలు రాకుండా నిషేధించింది తాలిబన్ ప్రభుత్వం.

Expensive Porcelain Bowl : చిన్న పింగాణి గిన్నె ధర అక్షరాలా రూ. కోటి, దాని ప్రత్యేక ఏంటో తెలుసా..?

ఈ ఆదేశం గురించి మంత్రి మొహమ్మద్ ఖలీద్ హనాఫీ (Mohammad Khalid Hanafi) మాట్లాడుతూ.. మహిళలు సైట్ సీయింగ్ కు వెళ్లాల్సినంత అవసరం లేదు అంటూ స్పష్టంచేశారు. మహిళలను పార్కులోకి వెళ్లకుండా మత పెద్దలు, సెక్యూరిటీ సంస్థలు అడ్డుకోవాలని ఆదేశించారు. ఎందుకంటే కొంతమంది మహిళలు హిజాబ్ ధరించటంలేదరి కొంతమంది ధరించినా సరైన పద్ధతిలో ధరించటంలేదని తమకు ఫిర్యాదుల వస్తున్నాయని తెలిపారు. హిజాబ్ ధరించకపోయినా..సరైన పద్ధతిలో ధరించకపోయినవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశంలో ఎన్నో పార్కులు మహిళల కోసం తెలిచే ఉంటాయని అక్కడకు నిరభ్యంతరంగా మహిళలు వెళ్లవచ్చని తెలిపారు.

కాగా తాలిబన్ ప్రభుత్వం విధించిన ఈ నిషేధంపై మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటి వరకు మహిళలను చదువుకు, ఆటకు, ఉద్యోగాలకు దూరం చేసి వారి స్వేచ్ఛను హరించారని, ఇప్పుడు ఏకంగా వారిని ప్రకృతి నుంచి కూడా దూరం చేయడం దారుణమంటు మండిపడ్డాయి.

 

ట్రెండింగ్ వార్తలు