14మంది కొడుకుల తర్వాత కూతురికి జన్మనిచ్చిన 45ఏళ్ల తల్లి

14మంది కొడుకుల తర్వాత కూతురికి జన్మనిచ్చిన 45ఏళ్ల తల్లి

Updated On : November 8, 2020 / 2:45 PM IST

కొత్త వ్యక్తిని భూమి మీదకు తీసుకురావడంలో.. ఓ సంతానానికి జన్మనిచ్చి ప్రపంచంలోకి ఆహ్వానించడంలో ఓ అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది. ఈ జంట అలా 14 మంది కొడుకులకు వెల్‌కమ్ చెప్పి ఇటీవలే మరో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆడపిల్లను కనాలనే ఆశతో ఎదురుచూసిన వారి కల ఇన్నేళ్లకు ఫలించింది.

కతేరీ స్కావాండ్ (45) ఏళ్ల తల్లి తనకు పుట్టిన ఏకైక కూతురి పేరు మ్యాగీ జైనె అనిపెట్టుకున్నట్లు మురిసిపోతూ చెప్పింది. జే స్కావాండ్ ఆమెను టీనేజ్ లో ఉన్నప్పుడు కలిశాడట. గేలార్డ్ హై స్కూల్, గేలార్డ్ సెయింట్ మేరీస్ స్కూల్ లో చదువుతుండగా వారిద్దరికీ పరిచయం అయింది. టీనేజ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్న వీరి ప్రేమకు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యేలోపే ముగ్గురు కొడుకులు పుట్టేశారు.



మిచిగాన్ లో ఉండే ఈ జంటకు మ్యాగీ పుట్టడం అనేది గ్రేటెస్ట్ గిఫ్ట్ అని సంబరపడిపోతున్నారు. ఇక ఆ పద్నాలుగు మంది అన్నలకు పుట్టిన ఏకైక చెల్లెల్ని చూసుకుని అవధుల్లేని సంతోషాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

‘మా పేరెంట్స్ కు పుట్టిన ఏకైక కూతురితో వారి కల నెరవేరింది’ అని పెద్ద కొడుకు 28ఏళ్ల టైలర్ స్కావాండర్ అంటున్నారు. మిగిలిన కొడుకుల పేర్లు ఇలా ఉన్నాయి. జాచ్, బ్రాండన్, టామీ, విన్నీ, కల్వన్, గాబె, వెస్లీ, ఛార్లీ, ల్యూక్, టక్కర్, ఫ్రాన్సిస్కో, ఫిన్లే.

ఈ దంపతుల చిన్న కొడుకు ఫిన్లే షిబొయ్‌గన్ ఏప్రిల్ 2018లో పుట్టాడు. ఆ బుడ్డోడి పేరులో ఓ జోక్ కలిపి పెట్టారు. మీడియాతో మాట్లాడుతూ.. 14వ సంతానం కూతురు పుడుతుందని ఆశించాం. అలా జరగకపోవడంతో అతనికి షి బాయ్ అగైన్ అనే పదాలు కలిపి ఫిన్లే షిబొయ్‌గన్ అని పెట్టామంటూ పేరులో సీక్రెట్ బయటపెట్టాడు.