Alabama shooting: చెల్లి ప్రాణాలు కాపాడి తన ప్రాణాలు కోల్పోయిన అన్న

Alabama shooting: ఫిల్ డౌడెల్ (18) అనే కుర్రాడి చెల్లి (16) పుట్టినరోజు పార్టీ జరుగుతోంది. ఇంతలో కాల్పులకు తెగబడడ్డాడు ఓ దుండగుడు.

Alabama shooting

Alabama shooting: చెల్లి ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలు అడ్డుగా పెట్టాడు ఓ అన్న. అమెరికాలోని అలబామా రాష్ట్రంలో (US state of Alabama) తాజాగా అలెక్సిస్ డౌడెల్ (16) అనే బాలిక పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న సమయంలో కాల్పుల కలకలం (Alabama shooting) చెలరేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

డాడెవిల్లే నగరంలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో మరి కొందరికి తీవ్రగాయాలయ్యాయి. అలెక్సిస్ డౌడెల్ తన 16వ పుట్టినరోజు వేడుక సందర్భంగా మహోగని మాస్టర్ పీస్ డ్యాన్స్ స్టూడియోలో తన స్నేహితులకు పార్టీ ఇచ్చింది. ఈ సందర్భంగా అక్కడ చోటుచేసుకున్న విషాద ఘటన గురించి అలెక్సిస్ డౌడెల్ వివరాలు తెలిపింది.

డ్యాన్స్ స్టూడియోలో కాల్పులు జరిగిన సమయంలో తన సోదరుడు ఫిల్ డౌడెల్ (18) అక్కడే ఉన్నాడని, తనను కాపాడాడని పేర్కొంది. ఒకరి వద్ద తుపాకీ ఉందని తన సోదరుడు ఫిల్ డౌడెల్ కు తెలియగానే తన వద్దకు వచ్చాడని చెప్పింది. ఓ వ్యక్తి తుపాకీతో తిరుగుతున్నాడని కొందరు అనుకుంటుంటే తన తల్లి లా టోన్యా అలెన్ కూడా విని, డ్యాన్స్ స్టూడియోలో లైట్లు అన్నీ వేసిందని చెప్పింది.

డీజే బూత్ వద్దకు వచ్చిందని తెలిపింది. తుపాకీని తీసుకొచ్చిన వారు పార్టీ నుంచి వెళ్లిపోయాలని చెప్పిందని ఆ బాలిక వివరించింది. అయితే, ఎవరూ స్పందించకపోవడంతో తన తల్లి డ్యాన్స్ స్టూడియోలో మళ్లీ మెయిన్ లైట్లను ఆఫ్ చేసిందని తెలిపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఓ దుండగుడు కాల్పులు జరిపాడని, పార్టీలో అందరూ భయకంపితులై ఒక్కసారిగా గట్టిగా అరుస్తూ తలుపుల వద్దకు పరుగులు తీశారని చెప్పింది.

ఆ సమయంలో తన సోదరుడు ఫిల్ డౌడెల్ తనను కిందకు నెట్టివేసి కాల్పుల బారి నుంచి తప్పించాడని ఆ బాలిక తెలిపింది. అనంతరం తన సోదరుడికి బుల్లెట్ తగిలిందని గుర్తించానని చెప్పింది. తన అన్న రక్తపు మడుగులో పడిపోయి ఉన్నాడని తెలిపింది. ధైర్యంగా ఉండు అని తన అన్నకు చెప్పానని పేర్కొంది. అదే అతడిని తాను చెప్పిన చివరి మాట అని కన్నీరు పెట్టుకుంది.

Alabama shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురి మృతి.. పలువురు టీనేజర్లకు గాయాలు