Alabama shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురి మృతి.. పలువురు టీనేజర్లకు గాయాలు

దాదాపు 20 మందికి గాయాలయ్యాయని, వారిలో చాలా మంది టీనేజర్లే ఉన్నారని అమెరికాలోని ఓ మీడియా సంస్థ తెలిపింది.

Alabama shooting: అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురి మృతి.. పలువురు టీనేజర్లకు గాయాలు

USA

Alabama shooting: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. అలబామా రాష్ట్రంలో (US state of Alabama) ఆ టీనేజర్ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. దీంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని అమెరికా మీడియా తెలిపింది. డాడెవిల్లే నగరంలో జరిగిన ఈ కాల్పుల ఘటనలో మరి కొందరికి తీవ్రగాయాలయ్యాయి.

దాదాపు 20 మందికి గాయాలయ్యాయని, వారిలో చాలా మంది టీనేజర్లే ఉన్నారని అమెరికాలోని ఓ మీడియా సంస్థ తెలిపింది. ప్రస్తుతం వారికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాల్పులు జరిగిన ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఓ బాలిక తన 16వ పుట్టినరోజు వేడుక సందర్భంగా తన స్నేహితులు అందరినీ మహోగని మాస్టర్ పీస్ డ్యాన్స్ స్టూడియోకి ఆహ్వానించింది.

పార్టీ జరుగుతున్న సమయంలో దుండగులు కాల్పులు జరిపి వారి ఆ టీనేజర్ల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపాడు. కాల్పుల ఘటనతో ఆ ప్రాంతంలోని వారందరూ భయంతో వణికిపోయారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నట్లు అలబామా రాష్ట్ర గవర్నర్ కే ఐవీ ఓ ప్రకటన చేశారు. అమెరికాలో పదే పదే కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇటువంటి ఘటనలను కట్టడి చేయలేకపోతోంది.

US Secretary: ప్రధాని మోదీపై అమెరికా కార్యదర్శి ప్రశంసల జల్లు