అయ్యయ్యో.. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద నదికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?

వృక్ష సంపదకు హాని కలిగించేలా పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.

ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద నది ‘అమెజాన్’ పరీవాహక ప్రాంతం ఎన్నడూలేనంత కరవును ఎదుర్కొంటోంది. నదిలో నీటి మట్టాలు మునుపెన్నడూ లేనంత కనిష్ఠ స్థాయికి తగ్గిపోయాయి. దీని ప్రతికూల ప్రభావం నావిగేషన్‌తో పాటు వన్యప్రాణులు, లోకల్ కమ్యూనిటీలపై పడుతోంది.

పెరూ, కొలంబియా, బ్రెజిల్‌లో ప్రవహించే ఈ నది ప్రాంతంలో తీవ్రమైన క్షామ పరిస్థితులు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. ‘అమెజాన్’ పరీవాహక ప్రాంతాల్లో అధికంగా జలవనరుల ద్వారానే వస్తువులు సరఫరా అవుతాయి. ఇప్పుడు ఈ నదిలో నీటి మట్టాలు భారీగా పడిపోయాయి.

ప్రపంచ వ్యాప్తంగా మహాసముద్రాలకు చేరే మంచినీటిలో ఆరవ వంతు అమెజాన్‌లోని 320 కిమీ వెడల్పు ఉండే ఓ డెల్టా నుంచి వెళుతుంది. ఈ నది పరిమాణం కాలాలను బట్టి మారుతుంది. వానలు తక్కువగా ఉన్న కాలాల్లో దీని వెడల్పు 4-5 కిలోమీటర్ల మధ్య ఉంటుంది.

వర్షాలు అధికంగా ఉన్న సమయంలో ఇది దాదాపు 50 కిలోమీటర్ల వెడల్పు వరకు పెరుగుతుంది. కొలంబియా సరిహద్దులో ఉన్న బ్రెజిల్ పట్టణం టబాటింగాలో అమెజాన్ ప్రధాన ఉపనది సోలిమోస్ ఉంది. ఈ నది కూడా రికార్డు స్థాయిలో కనిష్ఠానికి చేరుకుంది. ఇక తెఫె కాలువ పూర్తిగా ఎండిపోయింది.

గ్రీన్‌పీస్ ప్రతినిధి రొమ్యులొ బాటిస్టా ఈ పరిస్థితులపై మాట్లాడుతూ.. గత ఏడాది ఏర్పడిన కరవు పరిస్థితుల రికార్డును ఇప్పుడు ఏర్పడిన పరిస్థితులు బద్దలు కొట్టాయని చెప్పారు. నదీ పరివాహక ప్రాంతాలే కాకుండా బ్రెజిల్లోని వృక్ష సంపదకు హాని కలిగించేలా పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు.

అంతేగాక, దక్షిణ అమెరికా నగరాల్లో కార్చిచ్చుకు కూడా ఆజ్యం పోసేలా మారిందని చెప్పారు. స్థానిక నేత కంబేబా దీనిపై స్పందిస్తూ.. గత సంవత్సరంతో పోలిస్తే పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారిందని తెలిపారు. నదీ పరివాహక ప్రాంతాల్లో కరవు పరిస్థితులు ముందుగానే వచ్చాయని వివరించారు. వాతావరణ మార్పులపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.

Narendra Modi: ఇటువంటి వారిని ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు: ప్రధాని మోదీ