Narendra Modi: ఇటువంటి వారిని ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు: ప్రధాని మోదీ 

రక్షణ, శ్రేయస్సుపై ఇస్తున్న మోదీ గ్యారంటీపై ప్రజలకు పూర్తిగా నమ్మకం ఉందని ప్రధాని మోదీ తెలిపారు.

Narendra Modi: ఇటువంటి వారిని ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు: ప్రధాని మోదీ 

Updated On : September 19, 2024 / 3:51 PM IST

రాళ్లు విసిరేవాళ్లు, ఉగ్రవాదుల పట్ల సానుభూతి కనబర్చే పార్టీలను ప్రజలు జమ్మూకశ్మీర్‌ మొదటి దశ ఎన్నికల్లో తిరస్కరించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ ఆయన జమ్మూకశ్మీర్ ఎన్నికల సందర్భంగా శ్రీనగర్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన ప్రచార సభలో మాట్లాడారు.

రక్షణ, శ్రేయస్సుపై ఇస్తున్న మోదీ గ్యారంటీపై ప్రజలకు పూర్తిగా నమ్మకం ఉందని ప్రధాని మోదీ తెలిపారు. శ్రీనగర్‌కు వచ్చిన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నట్లు తెలిపారు. కాగా, సెప్టెంబర్ 18న మొదటి దశ ఓటింగ్ జరిగింది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో 61.13 శాతం ఓటింగ్ నమోదైంది. ఏడు జిల్లాల్లోని 24 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు.

అబ్దుల్లాలు, ముఫ్తీలు, గాంధీల చేతుల్లో మరో తరాన్ని నాశనం చేయనివ్వబోనని ప్రధాని మోదీ అన్నారు. శాంతి పునరుద్ధరణకు తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నానని అన్నారు. ఆ మూడు కుటుంబాల చేతిలో ఈ తరాన్ని నాశనం కానివ్వనని తెలిపారు.

జమ్మూకశ్మీర్ అంతటా పాఠశాలలు, కళాశాలలు సజావుగా నడుస్తున్నాయని, ఇప్పుడు పిల్లల చేతుల్లో పెన్నులు, పుస్తకాలు, ల్యాప్‌టాప్‌లు ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఇప్పుడు పాఠశాలల్లో కాల్పుల ఘటనలు జరగడం లేదని చెప్పారు. దానికి బదులుగా కొత్త పాఠశాలలు, కళాశాలలు, ఎయిమ్స్, మెడికల్ కళాశాలలు నిర్మితమవుతున్నాయని తెలిపారు.

తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడారు: వైవీ సుబ్బారెడ్డి