America Warns China : రష్యాకు సాయం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాలి-చైనాకు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్

తమ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు రష్యాకు ఎవరు సాయపడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది అమెరికా.(America Warns China)

America Warns China

America Warns China : యుక్రెయిన్ పై దురాక్రమణకు దిగిన రష్యాపై అమెరికా సహా పాశ్చాత్య దేశాలు భారీ ఎత్తున ఆంక్షలు విధించాయి. యుక్రెయిన్ పై పోరాటం కీలక దశలో ఉన్న తరుణంలో ఆంక్షల కారణంగా మిలిటరీ సామగ్రి కొరత రష్యాను వేధిస్తోంది. దాంతో మిలిటరీ వ్యవస్థల సామగ్రి అందజేయాలని తన మిత్రదేశం చైనాను రష్యా కోరింది. దీనిపై అగ్రరాజ్యం అమెరికా వెంటనే రియాక్ట్ అయ్యింది. ఘాటుగా తన స్పందించింది.(America Warns China)

తమ ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు రష్యాకు ఎవరు సాయపడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది అమెరికా. యుయిన్ పై యుద్ధం చేస్తున్న రష్యాకు.. చైనా సాయం అందించేందుకు ప్రయత్నిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ తేల్చి చెప్పారు.(America Warns China)

Ukraine president Zelenskyy:యుద్ధంలో గాయ‌ప‌డి చికిత్సపొందుతున్న సైనికులను పరామర్శించి..వారితో సెల్ఫీ దిగిన జెలెన్ స్కీ

ఈ మేరకు చైనా అధినాయకత్వంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంప్రదింపులు జరుపుతున్నామని, భారీ ఎత్తున ఆంక్షలను ఎదుర్కొంటున్న రష్యా కుదుటపడేందుకు ఎవరు సాయం అందించినా దాన్ని తాము అనుమతించబోమని వెల్లడించారు. రష్యాకు ఊరట కలిగించేలా ఆంక్షలను మీరి ఈ ప్రపంచంలో ఏ దేశం వ్యవహరించినా తమ నుంచి కఠిన చర్యలు చవిచూడాల్సి ఉంటుందన్నారు.

యుక్రెయిన్ పై రష్యా సేనల దాడులు కొనసాగుతున్నాయి. 19 రోజులుగా ముమ్మరంగా దాడులు చేస్తోంది రష్యా. యుక్రెయిన్ పై బాంబులు, క్షిపణుల వర్షం కురిపిస్తోంది.

యుద్ధం ప్రారంభంలో కేవలం యుక్రెయిన్ సైన్యం మీద మాత్రమే దాడులు చేసిన రష్యా సేనలు.. ఆ తర్వాత జనావాసాలపైనా బాంబు దాడులకు పాల్పడుతోంది. దీంతో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నారులు కూడా చనిపోతున్న దయనీయ స్థితులు నెలకొన్నాయి. మరియుపోల్‌ లో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. వేలాదిమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరియుపోల్ నగరంలో దాడులు మొదలైన 12 రోజుల్లో 1500లకు పైగా జనం మృత్యుఒడికి చేరినట్లు యుక్రెయిన్‌ విదేశాంగమంత్రి తెలిపారు. సామూహిక అంత్యక్రియలకు సంబంధించిన ఓ ఫొటోను ట్వీట్‌ చేశారు.

Russia Ukraine War : టెక్ దిగ్గజాలకు రష్యా షాక్.. విమర్శలు చేస్తే అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరిక..!

‘మరియుపోల్ ఇప్పుడు ఈ భూమి మీదనే అత్యంత దారుణమైన మానవతా విపత్తును ఎదుర్కొంటోంది. 12 రోజుల్లో 1582 మంది పౌరులు మరణించారు. కొందరిని ఇలా సామూహికంగా పూడ్చిపెట్టాల్సి వస్తోంది. యుక్రెయిన్‌ను ఎదుర్కోలేని పుతిన్‌ ప్రభుత్వం.. నిరాయుధులపై బాంబులు వేస్తోంది. సామాన్య పౌరులకు అందుతున్న మానవతా సాయాన్ని సైతం అడ్డుకుంటోంది’ అని ట్వీట్ లో వాపోయారు. రష్యా యుద్ధ నేరాలను ఆపేందుకు మాకు యుద్ధ విమానాలు కావాలని ప్రపంచ దేశాలను కోరారు.

రష్యా వైమానిక దాడులు చేయకుండా ఉండేలా తమ దేశంపై నో-ఫ్లై జోన్‌ను విధించాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ ఉత్తర అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (NATO)ను కోరారు. లేదంటే రష్యా రాకెట్లు నాటో భూభాగంపై పడతాయన్నారు. రష్యాను అడ్డుకోకుంటే.. పశ్చిమ దేశాలతో యుద్ధానికి దిగుతుందని జెలెన్ స్కీ హెచ్చరించారు. అంతేకాదు.. నార్డ్​ స్ట్రీమ్​2ను ఒక ఆయుధంగా ఉపయోగించుకునే అవకాశం ఉందన్నారు. ఐరోపా సమాఖ్యలో యుక్రెయిన్​ సభ్యత్వంపై చర్చల ప్రక్రియకు ప్రాధాన్యమిస్తామని ఈయూ కౌన్సిల్​ అధ్యక్షుడు చార్లెస్​ మైకెల్​ చెప్పినట్లు జెలెన్​స్కీ తెలిపారు.