Ukraine president Zelenskyy:యుద్ధంలో గాయ‌ప‌డి చికిత్సపొందుతున్న సైనికులను పరామర్శించి..వారితో సెల్ఫీ దిగిన జెలెన్ స్కీ

రష్యా-యుక్రెయిన్ యుద్ధంలో గాయ‌ప‌డి చికిత్సపొందుతున్న యుక్రెయిన్ సైనికులను పరామర్శించి..వారితో సెల్ఫీ దిగారు ప్రెసిడెంట్ జెలెన్ స్కీ.

Ukraine president Zelenskyy:యుద్ధంలో గాయ‌ప‌డి చికిత్సపొందుతున్న సైనికులను పరామర్శించి..వారితో సెల్ఫీ దిగిన జెలెన్ స్కీ

Ukraine President Volodymyr Zelenskyy Visited Hospital Where Injured Soldiers Are In Treatment

Updated On : March 14, 2022 / 5:59 PM IST

russia ukraine war..రష్యా-యుక్రెయిన యుద్ధంలో గాయపడిని యుక్రెయిన్ సైనికులను ప్రెసిడెంట్ జెలెన్ స్కీ పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారి కోరిక మేరకు వారితో సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యుద్ధంతో గాయాల‌పాలై ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న సైనికుల ప‌రామ‌ర్శ‌కు జెలెన్ స్కీ వెళ్లారు. ఈ సంద‌ర్భంగా సైనికుల‌కు ధైర్యం నూరిపోశారు. సైనికుల కోరిక మేరకు వారితో స‌ర‌దాగా సెల్ఫీలు దిగారు. సైనికులకు అందుతున్న చికిత్స‌‌పై అక్క‌డి వైద్య సిబ్బందిని వివరాలు అడిగారు. ప్రతీ ఒక్కరికి మెరుగైన చికిత్స అందించాలని స్వయంగా ఆదేశించారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

Also read : Russia Ukraine War : టెక్ దిగ్గజాలకు రష్యా షాక్.. విమర్శలు చేస్తే అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరిక..!

అణ్వ‌యుధాలు క‌లిగి ఉండ‌ట‌మే కాకుండా ఆర్థికంగా, సైనిక స‌త్తా ప‌రంగా కూడా ప్ర‌పంచంలోనే శ‌క్తిమంత‌మైన దేశంగా కొన‌సాగుతున్న ర‌ష్యాను యుక్రెయిన్ గత 19 రోజులుగా ఎదుర్కొంటోంది. రష్యా ఎంతగా దాడి చేస్తున్నా తగ్గేదే లేదు అంటోంది. ఓ పక్క యుద్ధం ఆపటానికి చర్చలు రెండు సార్లు చర్చలు కొనసాగినా ఎటువంటి ఫలితాలు రాలేదు. దీంతో రష్యా యుక్రెయిన్ ని ముప్పు తిప్ప‌లు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తోంది. ఇప్పటికే పలు నగరాలను స్వాధీనం చేసుకుంది. ఓ వైపు వంద‌లు, వేల మంది సైనిక ప‌టాలాన్ని ర‌ష్యా రంగంలోకి దించుతోంది రష్యా. అయినా యుక్రెయిన్ మాత్రం సాధ్యమైనంత వరకు రష్యాతో తలపడుతునే ఉంది.

Read Also : Russia Ukraine War : యుక్రెయిన్‌లో ఆగని రష్యా దాడులు.. రెండో మేయర్‌‌ను ఎత్తుకెళ్లారు!

యుక్రెయిన్ లో సైనికులతో పాటు సామాన్య జనాలు కూడా తమకు తోచినట్లుగా రష్యా సైనికులతో తలపడుతున్నారు. వారిని తికమకపెడుతున్నారు. ఈ యుద్ధం ఇన్ని రోజులుగా రష్యాకు భయపడకుండా కొనసాగుతుండటానికి..యుక్రెయిన్ సైన్యం స‌త్తా చాటుతుండ‌టానికి ఆ దేశ అధ్య‌క్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీనే కార‌ణ‌మ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. అందుకు నిద‌ర్శ‌నంగా అంత‌ర్జాతీయ మీడియా పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారిపోయింది.

Also read : Russia ukraine war : రష్యా దాడుల్లో 1582 మంది యుక్రెయిన్ పౌరుల మృతి..సామూహిక అంత్యక్రియలు చేస్తున్న ప్రభుత్వం

ఉక్రెయిన్‌పై ర‌ష్యా దండెత్తి రాగానే.. మామూలుగా అయితే యుక్రెయిన్‌రష్యాకు వ‌ణికిపోవాలి. అందుకు విరుద్ధంగా ర‌ష్యా సేనల‌ను నిలువ‌రించి మ‌రీ యుక్రెయిన్ సైన్యం స‌త్తా చాటుతోంది. రష్యా సైన్యం ముందు నిలవలేకపోతున్నా పోరాటాన్ని మాత్రం ఆపకుండా కొనసాగిస్తోంది. శక్తికి మించి పోరాడుతోంది. ఈ క్ర‌మంలో యుద్ధం మొద‌లైన రెండో రోజే సైనిక దుస్తుల్లోకి మారిపోయిన జెలెన్‌స్కీ.. క‌ద‌న రంగంలోని సైనికుల వ‌ద్ద‌కు వెళ్లారు. వారిని స్వయంగా పరామర్శించారు. వారితో సరదాగా సెల్ఫీలు దిగి మీ వెనుక నేనున్నాననే భరోసా ఇస్తున్నారు.

Also read : UK ‘Homes for Ukraine’:యుక్రెయిన్ ప్రజలకు ఆశ్రయం ఇస్తే బహుమతి..ఒక్కో శరణార్థికి 456 డాలర్లు: బ్రిటన్ ప్రకటన

ఈ యుద్ధంలోనేను కూడా మీతో సమానం అనే భావన సైనికుల్లో కల్పించారు. గెలిచినా..ఓడినా పోరాటం మాత్రం కొనసాగిద్దాం అంటూ గాయపడిన సైనికుల్లో ధైర్యాన్ని నూరిపోశారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.