Russia ukraine war : రష్యా దాడుల్లో 1582 మంది యుక్రెయిన్ పౌరుల మృతి..సామూహిక అంత్యక్రియలు చేస్తున్న ప్రభుత్వం

రష్యా దాడుల్లో 1582 మంది యుక్రెయిన్ పౌరుల మృతి చెందగా వారికి సామూహిక అంత్యక్రియలు చేస్తోంది యుక్రెయిన్ ప్రభుత్వం.

Russia ukraine war : రష్యా దాడుల్లో 1582 మంది యుక్రెయిన్ పౌరుల మృతి..సామూహిక అంత్యక్రియలు చేస్తున్న ప్రభుత్వం

1582 Dead Civilians In 12 Days, Even Buried In Mass Graves Like This One. Unable To Defeat The Ukrainian Army,

Russia ukraine war :  యుక్రెయిన్‌పై రష్యా వరుస బాంబు పేలుళ్లతో విరుచుకుపడుతోంది. యుద్ధం ప్రారంభంలో కేవలం యుక్రెయిన్ పై పట్టుకోసం…సైన్యంమీద మాత్రమే దాడులు చేసేది. ప్రభుత్వానికి సంబంధించి కట్టడాలపై బాంబులు వేసి ధ్వంసం చేసేంది.నగరాలపై విరుచుకుపడేది రష్యా సైన్యం. కానీ కొన్ని రోజులుగా రష్యా సేనలు యుక్రెయిన్ జనావాసాలపై బాంబు దాడులకు పాల్పడుతోంది. దీంతో సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నారులు కూడా చనిపోతున్న దయనీయ స్థితులు హదయాలను పిండేస్తున్నాయి.

Also read : UK ‘Homes for Ukraine’:యుక్రెయిన్ ప్రజలకు ఆశ్రయం ఇస్తే బహుమతి..ఒక్కో శరణార్థికి 456 డాలర్లు: బ్రిటన్ ప్రకటన

దీంట్లో భాగంగా మేరియుపోల్‌ లో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారాయి. వేలాదిమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఓ పక్క వేదన..మరోపక్క రష్యాపై ఆగ్రహం రగుతున్నా..చేసేదేంలేక స్థానిక ప్రభుత్వం మృతులకు సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తోంది. మేరియుపోల్ నగరంలో దాడులు మొదలైన 12 రోజుల్లో 1500లకు పైగా జనం మృత్యుఒడికి చేరినట్లు యుక్రెయిన్‌ విదేశాంగమంత్రి దిమిత్రో కుబేలా వెల్లడించారు. ఈ సామూహిక అంత్యక్రియలకు సంబంధించిన ఓ ఫొటోను ట్వీట్‌ చేశారు.

Also read : Russia Ukraine War : యుక్రెయిన్‌లో నో- ఫ్లై జోన్ విధించాలి.. నాటోకు జెలెన్‌స్కీ విజ్ఞప్తి..!

‘మేరియుపోల్ ఇప్పుడు ఈ భూమి మీదనే అత్యంత దారుణమైన మానవతా విపత్తును ఎదుర్కొంటోంది. 12 రోజుల్లో 1582 మంది పౌరులు మరణించారు. కొందరిని ఇలా సామూహికంగా పూడ్చిపెట్టాల్సి వస్తోంది. యుక్రెయిన్‌ను ఎదుర్కోలేని పుతిన్‌ ప్రభుత్వం.. నిరాయుధులపై బాంబులు వేస్తోంది. సామాన్య పౌరులకు అందుతున్న మానవతా సాయాన్ని సైతం అడ్డుకుంటోంది’ అని ట్వీట్ లో పేర్కొన్నారు. రష్యా యుద్ధ నేరాలను ఆపేందుకు మాకు యుద్ధ విమానాలు కావాలి అని ప్రపంచ దేశాలను కోరారు.