UK ‘Homes for Ukraine’:యుక్రెయిన్ ప్రజలకు ఆశ్రయం ఇస్తే బహుమతి..ఒక్కో శరణార్థికి 456 డాలర్లు: బ్రిటన్ ప్రకటన

యుక్రెయిన్ ప్రజలకు ఆశ్రయం ఇస్తే బహుమతి ఇస్తామని ప్రకటించింది. యుక్రెయిన్ నుంచి వచ్చిన ఒక్కో శరణార్థికి 456 డాలర్లు చొప్పున ఇస్తామని బ్రిటన్ ప్రకటించింది.

UK ‘Homes for Ukraine’:యుక్రెయిన్ ప్రజలకు ఆశ్రయం ఇస్తే బహుమతి..ఒక్కో శరణార్థికి 456 డాలర్లు: బ్రిటన్ ప్రకటన

Uk ‘homes For Ukraine’ scheme

UK ‘Homes for Ukraine’ Scheme : యుక్రెయిన్ పై రష్యా యుద్ధంతో యుక్రెయిన్ ప్రజల జీవితాలు అత్యంత దుర్భరంగా మారియి. సొంత దేశాన్ని..ఉన్న ఇంటిని వదిలిసి దిక్కులేని వారిలాగా ఇతర దేశాలకు వలసపోయి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి. యుక్రెయిన్ వాసులు పక్క దేశాలకు తరలిపోతున్నారు. యూరప్ లో ఉండే పలు దేశాలకు వలసలు పోయిన జీవిస్తున్నారు. వారి బంధువులు ఉన్న దేశాలకు పోయి తలదాచుకుంటున్నారు. అలా ఎంతోమంది యుక్రెయిన్లు యూకేలోని బ్రిటన్ స్కాట్లాంట్ వంటి దేశాలకు తరలిపోయారు.

Also read : Russia Ukraine War : యుక్రెయిన్‌లో నో- ఫ్లై జోన్ విధించాలి.. నాటోకు జెలెన్‌స్కీ విజ్ఞప్తి..!

అలా వచ్చినవారిని బ్రిటన్ అక్కున చేర్చుకుంటోంది. రష్యాపై కారాలు మిరియాలు నూరుతున్న బ్రిటన్ యుక్రెయిన్ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తోంది. దీంట్లో భాగంగా యుక్రెయిన్ శరణార్ధులకు తమ ఇంట్లో చోటు (ఆశ్రయం) కల్పిస్తేవారికి నగదు బహుమానంగా ఇస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. యుక్రెయిన్ శరణార్థులకు ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే ఒక్కో యుక్రెయిన్ శరణార్థికి 450 డాలర్లు (UK currency 350 pounds)చొప్పున చెల్లిస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.

‘హోమ్స్‌ ఫర్‌ ఉక్రెయిన్‌’ ప్రోగ్రామ్‌ ప్రకటించిన ప్రభుత్వం..456 డాలర్లు ఇస్తామన్న ప్రభుత్వం..
యుక్రెయిన్‌ నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి వచ్చే శరణార్థులకు బ్రిటన్‌లో ఆశ్రయం కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం చకచక ఏర్పాట్లు చేస్తోంది. దీని కోసం ‘హోమ్స్‌ ఫర్‌ ఉక్రెయిన్‌’ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. బ్రిటన్‌ వాసులు ఎవరైన యుక్రెయిన్‌ శరణార్థులకు ఇల్లు ఇచ్చి ఆశ్రయం కల్పిస్తే ప్రభుత్వం ప్రతినెల ఒక్కో శరణార్థికి 450 డాలర్లు చొప్పున చెల్లిస్తామని బ్రిటన్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మిషెల్‌ గోవె వెల్లడించారు. నీడ అవసరమైన వారికి మనమందరం కలిసి సురక్షితమైన ఇంటిని ఇద్దాము అని మిషెల్‌ గోవె పిలుపునిచ్చారు.

Also read : Russia Ukraine War : రష్యాలో ఇన్‌స్టాగ్రామ్‌పై నిషేధం.. 8 కోట్ల మంది యూజర్లు యాక్సస్ చేసుకోలేరు..!

ఈ పథకంలో శరణార్థులకు కనీసం ఆరు నెలల అద్దె లేకుండా ఇల్లు ఇచ్చేందుకు ముందుకొచ్చే వారి పేర్లను సంబంధిత అధికారవర్గాల వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ గ్రూపులు, వ్యాపార సంస్థలు ఎవరైనాఇక్కడ నమోదు చేయించుకోవచ్చని వెల్లడించింది. ఈ రకంగా ఆశ్రయం ఇచ్చిన వారికి నెలకు 456 డాలర్లు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.

యుక్రెయిన్ శరణార్థులకు యూకే వీసాలు అసవరం లేదు.. శరణార్ధులకు విద్యా,ఉద్యోగ, వైద్యం సదుపాయాలు
యుక్రెయిన్‌ ప్రజలకు 3వేల వీసాలు జారీ చేసినట్లు యూకే వెల్లడించింది. గురువారం (మార్చి 11,2022) నుంచి యుక్రెయిన్‌ నుంచి వచ్చే ప్రజలకు వీసాలు అవసరం లేదని.. కేవలం ఆ దేశ పాస్‌పోర్టు ఉంటే చాలని పేర్కొంది. ఈ విషయాన్ని యూకే సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మిషెల్‌ గోవె వెల్లడించారు. యుక్రెయిన్‌లోని యుద్ధ క్షేత్రం నుంచి వచ్చే ప్రజలకు వీలైనంత సాయం చేస్తామని..వారికి విద్యా,ఉద్యోగ, వైద్యంతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

Also read : Russia Ukraine War : యుక్రెయిన్‌లో ఆగని రష్యా దాడులు.. రెండో మేయర్‌‌ను ఎత్తుకెళ్లారు!