Russia Ukraine War : యుక్రెయిన్‌లో ఆగని రష్యా దాడులు.. రెండో మేయర్‌‌ను ఎత్తుకెళ్లారు!

Russia Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుక్రెయిన్‌పై ఎంతకీ లొంగకపోవడంతో రష్యా హింసాత్మక చర్యలకు పాల్పడుతోంది.

Russia Ukraine War : యుక్రెయిన్‌లో ఆగని రష్యా దాడులు.. రెండో మేయర్‌‌ను ఎత్తుకెళ్లారు!

Russia Ukraine War Russian Forces Accused Of Abducting Second Mayor

Russia Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుక్రెయిన్‌పై ఎంతకీ లొంగకపోవడంతో రష్యా హింసాత్మక చర్యలకు పాల్పడుతోంది. యుక్రెయిన్ పౌరులు సహకరించడం లేదనే కారణంతో రష్యా బలగాలు విచక్షణ లేకుండా దాడులకు పాల్పడుతున్నాయి. యుక్రెయిన్ దీటుగా రష్యా బలగాలను తిప్పికొడుతున్నాయి. ఎలాగైనా యుక్రెయిన్ పౌరులను, అక్కడి ప్రభుత్వాన్ని భయపెట్టేందుకు దౌర్జన్యకాండకు దిగుతోంది. ఈ నేపథ్యంలో రష్యా ఒకవైపు యుక్రెయిన్‌పై దాడులకు తెగబడుతూనే.. మరోవైపు యుక్రెయిన్ ప్రముఖ వ్యక్తులను కిడ్నాప్ చేస్తోంది.

ఇప్పటికే ఒకే యుక్రెయిన్ నగర మేయర్‌ను కిడ్నాప్ చేశాయి రష్యాబలగాలు. ఇప్పుడు రెండో నగర మేయర్ కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. ద్నిప్రోరుడ్నే నగర మేయర్‌ యెవ్‌హన్‌ మాత్వేయెవ్‌ (Yevhen Matveyev)ను కిడ్నాప్ చేసినట్టు యుక్రెయిన్ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రష్యా మూకలు ద్నిప్రోరుడ్నే మేయర్‌ యెవ్‌హన్‌ మాత్వేయెవ్‌ను కిడ్నాప్‌ చేశారని యుక్రెయిన్‌ విదేశాంగ శాఖ మంత్రి దిమిత్రో కులేబా (Foreign Minister Dmytro Kuleba) వెల్లడించారు. యుక్రెయిన్ పౌరులు సహకరించడం లేదని కారణంతో విచక్షణ కోల్పోయిన రష్యా బలగాలు హింసకు పాల్పడుతున్నాయని కులేబా ఆరోపించారు.

Russia Ukraine War Russian Forces Accused Of Abducting Second Mayor (1)

Russia Ukraine War : Russian Forces Accused Of Abducting Second Mayor

యుక్రెయిన్‌పై రష్యా దాడులను ఆపేందుకు చొరవ చూపాలని అంతర్జాతీయ సమాజానికి కూడా ట్విటర్‌ వేదికగా విజ్ఞప్తి చేశారు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. ఇప్పటికే దక్షిణ యుక్రెయిన్‌లోని మెలిటొపోల్‌ను రష్యా బలగాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. గత శుక్రవారం నగర మేయర్‌ను కిడ్నాప్‌ చేశారు. ఆయుధాలతో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు.. బలవంతంగా మేయర్‌ ఇవాన్‌ ఫెడోరోవ్‌ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న వీడియోను యుక్రెయిన్‌ అధ్యక్ష కార్యాలయం డిప్యూటీ హెడ్‌ కిరిల్‌ తిమోషెంకో సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

తమకు యక్రెయిన్ పౌరులు సహకరించట్లేదని అందుకే నగర మేయర్‌ను కిడ్నాప్ చేసినట్టు యుక్రెయిన్‌ వెల్లడించింది. నగర మేయర్ ను రష్యా బలగాలు కిడ్నాప్ చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. రెండో నగర మేయర్‌ను కూడా రష్యా బలగాలు కిడ్నాప్‌ చేసినట్టు అధ్యక్షుడు జెలెన్‌స్కీ ధ్రువీకరించారు.

Read Also : Dementia : పుతిన్‌‌కు పార్కిన్సన్ వ్యాధి.. బ్రిటన్ మీడియా ఆరోపణలు