Russia Ukraine War : టెక్ దిగ్గజాలకు రష్యా షాక్.. విమర్శలు చేస్తే అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరిక..!
Russia Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. రష్యా దాడులు 19వ రోజుకు చేరుకున్నాయి. రష్యా దాడులపై వ్యతిరేకంగా విమర్శలు చేస్తే అరెస్ట్ చేస్తామని హెచ్చరిస్తోంది.

1russian Officials Warned Companies Like Mcdonald's And Ibm That Corporate Leaders Who Criticize The Government Could Be Arrested
Russia Ukraine War : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఫిబ్రవరి 24న మొదలైన రష్యా దండయాత్ర 19వ రోజుకు చేరుకుంది. రష్యా దాడుల నేపథ్యంలో తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా విమర్శలు చేస్తే అరెస్ట్ చేస్తామని టెక్ దిగ్గజ కంపెనీలకు రష్యా అధికారులు హెచ్చరించారు. రష్యా చర్యలకు వ్యతిరేకంగా ఏ టెక్ కంపెనీ అయిన తప్పుగా మాట్లాడితే తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. రష్యాకు వ్యతిరేకంగా ఏ టెక్ సంస్థ అయిన మాట్లాడితే వారి కార్పొరేట్ సంస్థల ఆస్తులతో పాటు సంస్థ ప్రతినిధులను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. యుక్రెయిన్‌పై రష్యా దాడులను వెంటనే నిలిపివేయాలంటూ గతకొద్దిరోజులుగా పలు టెక్ దిగ్గజాలు రష్యాలో తమ కార్యకలాపాల్ని నిలిపివేస్తున్నాయి.
యురేపియన్ యూనియన్ దేశాలతో పాటు 50కి పైగా టెక్ కంపెనీలు తమ సర్వీసులను రష్యాలో నిలిపివేశాయి. ఈ నేపథ్యంలోనే రష్యా ప్రభుత్వం యురేపియన్ యూనియన్ దేశాల దిగ్గజ కంపెనీలను హెచ్చరించింది. ఈ మేరకు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. రష్యా ప్రభుత్వం అనేక కంపెనీలను బెదిరించినట్టు తెలుస్తోంది. మెక్‌డొనాల్డ్స్ (McDonald), బీఎం (IBM), ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్ప్ (Machines Corp), యమ్ కార్ప్ (Yum Corp), కేఎఫ్‌సీ (KFC), పిజ్జా హట్ (Pizza Hut), టాకో బెల్ (Taco Bell) కంపెనీలను హెచ్చరించింది.
రష్యాకు వ్యతిరేకంగా మాట్లాడితే ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంటామని, సీఈఓ ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లను అరెస్ట్ చేస్తామని రష్యా అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పలు కంపెనీలు రష్యా నుంచి ఉన్నతస్థాయిలో ఎగ్జిక్యూటివ్‌లను బదిలీ చేస్తున్నాయి. రష్యాలో తమ రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేస్తున్నాయి, అలాగే ఆఫీసు కార్యకలాపాలను కూడా నిలిపివేస్తున్నట్లు మెక్‌డొనాల్డ్ ప్రకటించింది. రష్యాలో పనిచేస్తున్న 62వేల మంది ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తామని కంపెనీ వెల్లడించింది. రష్యా హెచ్చరికలతో స్పందించిన పలు టెక్ కంపెనీలు రష్యా నుంచి తమ ఎగ్జిక్యూటివ్‌లను బదిలీ చేసేందుకు పని చేస్తున్నాయని నివేదిక తెలిపింది.
Read Also : Russia Ukraine War : యుక్రెయిన్‌లో ఆగని రష్యా దాడులు.. రెండో మేయర్‌ను ఎత్తుకెళ్లారు!