US – Russia Fight: ఉక్రెయిన్ లో ఉండే అమెరికన్లు వెనక్కు రావాలని బైడెన్ సూచన

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అనంతరం ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫిబ్రవరి 14-15న అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో భేటీ కానుండగా అదే సమయంలో జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ పుతిన్ తో భేటీ కానున్నారు

US – Russia Fight: ఉక్రెయిన్ లో నివసిస్తున్న అమెరికన్లు తిరిగి స్వదేశానికి వచ్చే ఏర్పాట్లు చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సూచనలు జారీ చేశారు. ఉక్రెయిన్ విషయంలో రష్యా, అమెరికా మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో జో బైడెన్ చేసిన సూచనలు మరింత గుబులు రేపుతున్నాయి. ఉక్రెయిన్ లో రష్యా తమ బలగాలను మోహరింపజేయడం పట్ల స్పందించిన బైడెన్.. జర్మనీ – రష్యా మధ్య కీలకమైన “నార్డ్ స్ట్రీమ్ 2” గ్యాస్ పైప్ లైన్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ తో కలిసి వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన బైడెన్ ఈమేరకు ఈ వ్యాఖ్యలు చేశారు.

Also read: Hi-Tech Beggar: చిల్లర లేకుంటే “గూగుల్ పే” చేయండి బాబయ్య: హైటెక్ బిచ్చగాడు

ఉక్రెయిన్ వ్యవహారంలో కాస్త ఆచూతూచి అడుగేయాలంటూ రష్యా మిత్ర పక్షాలు అధ్యక్షుడు పుతిన్ ను కోరుతుంటే.. అమెరికా సహా నాటో దళాలు వెనక్కు తగ్గితేనే తాము తగ్గుతామంటూ రష్యా ప్రకటించింది. ఈక్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో మాట్లాడేందుకు జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్ వైట్ హౌస్ కి చేరుకోగా..ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మాస్కో చేరుకుని పుతిన్ తో సమావేశం అయ్యారు. స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిపి యుద్ధ నివారణ చర్యలకు వీరు ప్రయత్నిస్తున్నారు.

రష్యా ఎపుడైనా ఉక్రెయిన్ పై దండయాత్ర చేయవచ్చని.. అదే జరిగితే చెప్పలేనంత అపారమైన మానవనష్టం జరుగుతుందని జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ తెలిపారు. అయితే ఉక్రెయిన్ పై దండయాత్ర చేసే ఉద్దేశం లేదని రష్యా పదేపదే చెబుతున్నా..బలగాలను ఉపసంహరించుకోకపోవడం తూర్పు యూరోప్ లో అశాంతి వాతావరణానికి కారణం అవుతుంది. దీంతో జర్మన్, ఫ్రాన్స్ దేశాధినేతలు అటు రష్యాను, ఇటు అమెరికాను బుజ్జగించి..యూరోప్ లో శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్, ను కలిసిన అనంతరం సోమవారం పుతిన్ మాట్లాడుతూ.. యూరోప్ లో శాంతిని కాంక్షిస్తున్న ఫ్రాన్స్ మాటలకు గౌరవం ఇస్తున్నట్లు తెలిపారు.

Also read: Yogi Vs Kejriwal: సీఎంలు “యోగి – కేజ్రీవాల్” మధ్య అర్ధరాత్రి ట్విట్టర్ యుద్ధం

రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అనంతరం ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఫిబ్రవరి 14-15న అమెరికా అధ్యక్షుడు బైడెన్ తో భేటీ కానుండగా.. అదే సమయంలో జర్మన్ ఛాన్సలర్ ఒలాఫ్ పుతిన్ తో భేటీ కానున్నారు. దీంతో ఉక్రెయిన్ విషయంలో రష్యా వెనక్కు తగ్గి.. యూరోప్ లో శాంతి నెలకొంటుందని అన్ని దేశాలు భావిస్తున్నాయి. కానీ ఉక్రెయిన్ లో ఉంటున్న అమెరికన్లను వెనక్కు రమ్మనడంలో బైడెన్ ఆంతర్యం ఏమిటో అర్ధంకావడం లేదు.

Also read: Arunachal Avalanche: హిమపాతంలో చిక్కుకుని ఏడుగురు సైనికాధికారులు గల్లంతు

ట్రెండింగ్ వార్తలు