Hi-Tech Beggar: చిల్లర లేకుంటే “గూగుల్ పే” చేయండి బాబయ్య: హైటెక్ బిచ్చగాడు

దానం చేసేందుకు చిల్లర లేకపోతేనేం.. గూగుల్ పే, ఫోన్ పే, పేటియం చేయండి అంటూ మెడలో "QR Code" వేసుకుని తిరుగుతున్నాడు.

Hi-Tech Beggar: చిల్లర లేకుంటే “గూగుల్ పే” చేయండి బాబయ్య: హైటెక్ బిచ్చగాడు

Beggar

Hi-Tech Beggar: ఎవరూ ఆదుకోలేని నిస్సహాయ స్థితిలో వీధుల్లో బిచ్చమెత్తుకుంటు..జీవితాన్ని నెట్టుకొస్తుంటారు కొందరు. జనసమూహాలు, ట్రాఫిక్ సిగ్నళ్లు, దేవాలయాల వద్ద బిచ్చగాళ్లను గమనిస్తూనే ఉంటాం. వారి పరిస్థితికి జాలిపడి..కొందరు తమకు తోచినంత సాయం చేస్తుంటారు. లేదంటే చిల్లర లేదని వెళ్ళిపోతారు. డిజిటల్ పేమెంట్స్ పుణ్యమాని.. ఇప్పుడు ప్రజలు జేబులో డబ్బులు లేకుండానే తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్లినా.. మొబైల్ పేమెంట్స్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. దీంతో బిచ్చగాళ్ళు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. బిచ్చమడిగిన ప్రతిసారి “జేబులు చిల్లర లేదు, ఉంటే ఇచ్చేవాడినే” అనే మాటలే వింటున్నారు. ప్రజలు ఇచ్చే చిల్లరపైనే ఆధారపడి జీవించే బిచ్చగాళ్ళు..ఈతరహా మాటలు విని “ఇలాగైతే కడుపు నింపుకోవడం కష్టమే” అంటూ నిట్టూరుస్తున్నారు.

Also read: Yogi Vs Kejriwal: సీఎంలు “యోగి – కేజ్రీవాల్” మధ్య అర్ధరాత్రి ట్విట్టర్ యుద్ధం

అయితే బీహార్ కు చెందిన రాజు ప్రసాద్ అనే బిచ్చగాడు మాత్రం..నిట్టూర్పుల నుంచి మినహాయించుకున్నాడు. ప్రజలతో పాటు తానుకూడా అప్డేట్ అయి.. డిజిటల్ సాంకేతికతను అందిపుచ్చుకున్నాడు. దానం చేసేందుకు చిల్లర లేకపోతేనేం.. గూగుల్ పే, ఫోన్ పే, పేటియం చేయండి అంటూ మెడలో “QR Code” వేసుకుని తిరుగుతున్నాడు. ఇటీవల తాను SBI బ్యాంకులో ఖాతా తెరిచానని.. ఆ ఖాతాకు మొబైల్ నెంబర్ ను జత చేసి..UPI పేమెంట్స్ లింక్ ఏర్పాటు చేసుకున్నట్లు బిచ్చగాడు రాజు ప్రసాద్ వివరించాడు.

Also read: Arunachal Avalanche: హిమపాతంలో చిక్కుకుని ఏడుగురు సైనికాధికారులు గల్లంతు

ఇటీవల కాలంలో దానం అడిగిన ప్రతిసారి చిల్లరలేదంటూ ప్రజలు దానం చేయడం లేదని, దీంతో పూటగడవని స్థితిలో బిక్కుబిక్కుమంటూ గడిపానని రాజు ప్రసాద్ చెప్పాడు. ప్రభుత్వం ఇచ్చిన ఆధార్ కార్డుతో బ్యాంకు అకౌంట్ తెరిచానని.. అయితే బ్యాంకు వారు PAN కార్డు కూడా అడగడంతో దాన్ని సంపాదించేందుకు అష్టకష్టాలు పడ్డానని.. ఎట్టకేలకు PAN కార్డు సంపాదించి బ్యాంకు ఖాతా తెరిచినట్లు రాజు ప్రసాద్ తెలిపాడు. బీహార్ లో పశ్చిమ చంపారన్ జిల్లా బెట్టయ్య ప్రాంతంలో నివసించే రాజు ప్రసాద్, స్థానిక రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ వద్ద బిచ్చమెత్తుకుంటున్నాడు.

Also read: Arasavelli Temple: అరసవెల్లిలో తొలిపూజలో పాల్గొన్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్