Former Chinese leader Hu Jintao : కమ్యూనిస్టు మహాసభలో చైనా మాజీ అధ్యక్షుడికి అవమానం .. సభనుంచి బలవంతంగా బయటకు పంపించేసిన వైనం

చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. చైనా మాజీ అధ్యక్షుడుకి ఘోర అవమానం జరిగింది. మాజీ అధ్యక్షుడు హుజింటావోను బలవంతంగా పంపించేసిన ఘటన యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. హుజింటావోను ఎందుకు బయటకు పంపించారో చైనా ఇంకా వెల్లడించలేదు. హుజింటావోను బలవంతంగా బయటకు పంపించివేసిన ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Former Chinese leader Hu Jintao (1)

Former Chinese leader Hu Jintao: చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. చైనా మాజీ అధ్యక్షుడుకి ఘోర అవమానం జరిగింది. మాజీ అధ్యక్షుడు హుజింటావోను బలవంతంగా పంపించేసిన ఘటన యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. హుజింటావోను ఎందుకు బయటకు పంపించారో చైనా ఇంకా వెల్లడించలేదు. హుజింటావోను బలవంతంగా బయటకు పంపించివేసిన ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

గత వారంరోజులుగా చైనా కమ్యూనిస్టు మహాసభలు జరుగుతున్నాయి. ఈ సమావేశం ముగింపు దశకు చేరుకుంది. చివరి రోజున కీలక నిర్ణయాలు, తీర్మానాలు చేసింది సెంట్రల్ కమిటీ. అయితే…ఈ ముగింపు కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. చైనా మాజీ అధ్యక్షుడు హు జింటావో ( Hu Jintao)ను ఉన్నట్టుండి హాల్‌లో నుంచి బయటకు పంపేశారు. గ్రేట్ హాల్‌లో ముందు వరసలో అధ్యక్షుడు జిన్‌పింగ్ కూర్చోగా..ఆయన పక్కనే మాజీ అధ్యక్షుడు హు జింటావో కూర్చున్నారు.

స్టాఫ్ మెంబర్స్ అక్కడికి వచ్చి జింటావోతో ఏదో మాట్లాడారు. మొదటి ఓ వ్యక్తి వచ్చి ఆయనకు చెప్పారు. అయితే…ఆయన అక్కడి నుంచి వెళ్లేందుకు అంగీకరించనట్లుగా కనిపిస్తోంది వీడియోలో. ఆ తరవాత మరో ఇద్దరు సిబ్బంది వచ్చి మాట్లాడారు. ఓ వ్యక్తి జింటావోని కుర్చీలో నుంచి లేపారు. మరో ఇద్దరు ఆయనకు రెండు వైపులా నిలబడి పట్టుకున్నారు. కాసేపు మాట్లాడిన తరవాత ముందుకు కదిలారు. వెళ్లే ముందు జిన్‌పింగ్‌తోనూ ఏదో చెప్పారు. కానీ ఆయనకూడా పెద్దగా పట్టించుకోనట్లే కనిపిస్తోంది.

ఆ తరవాత సిబ్బంది ఆయనను నడిపించుకుంటూ తీసుకెళ్లి బయటకు పంపారు. ఈ దృశ్యాన్ని హాల్‌లో దాదాపు రెండు నిముషాల పాటు అందరూ మౌనంగా ఈ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియోని ట్విటర్‌లో పోస్ట్ చేయగా…వైరల్ అవుతోంది. కానీ ఆయనకు అవమానం జరిగినట్లుగా కనిపిస్తోంది వీడియోలో. మరి దీని గురించి చైనా ఏం చెబుతుందోనని ఆసక్తి నెలకొంది.