Crow vs Drone : ఆకాశంలో ఎగిరే హక్కు మాది..నవ్వేంటి మాకు పోటీ..డ్రోన్ ను కూలదోసిన కాకి

ఆహారం డెలివరీ చేస్తున్న డ్రోన్ పై కాకి దాడి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Crow vs Drone : ఆకాశంలో ఎగిరే హక్కు మాది..నవ్వేంటి మాకు పోటీ..డ్రోన్ ను కూలదోసిన కాకి

Crow Vs Drone

Updated On : September 24, 2021 / 5:15 PM IST

Crow vs Drone :  ప్రపంచంలోని కొన్ని దేశాల్లో డ్రోన్ల ద్వారా, ఆహారం మందులు సరఫరా చేస్తుంటారు. తాజాగా ఫుడ్ డెలివరీ కంపెనీలు కూడా డ్రోన్ల ద్వారా డెలివరీ స్టార్ట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రా గూగుల్‌ భాగస్వామ్యంతో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన డ్రోన్‌ వింగ్‌ని ప్రజా సేవల వినియోగ నిమిత్తం 2019 నుంచి ప్రారంభించింది. ఈ డ్రోన్ ద్వారా ఆహారం, మెడిసిన్, కాఫీ వంటివి సరఫరా చేస్తుంటారు.

Read More : Grandma Car Drivng : బామ్మా నువ్వు సూపర్.. 90ఏళ్ల వయసులో అద్భుతంగా కారు డ్రైవింగ్.. సీఎం సైతం ఫిదా

ఐతే ఓ వ్యక్తి ఫుడ్ ఆర్డర్ చేశాడు. తన ఫుడ్ ని తీసుకోని ఓ డ్రోన్ ఆకాశంలో ఎగురుతూ తన ఇంటివైపుకు వస్తోంది. డ్రోన్ ని గమనించిన కాకి దానిపై దాడి చేసింది. దానిని నోటితో పట్టుకొని ఆపే ప్రయత్నం చేసింది. ఆకాశంలో ఎగిరే హక్కు నీకెవరిచ్చారు అంటూ డ్రోన్ ని ప్రశ్నించినట్లుగా ఉన్నాయి కాకి చేష్టలు.. రెండు కాళ్లతో తంతు డ్రోన్ ని పడేసినంత పనిచేసింది. దీనిని గమనించిన కస్టమర్ వీడియో తీశాడు. అయితే కాకి దాడితో డెలివరీ పాయింట్ కంటే ముందే ఆ ఫుడ్ పార్సిల్ ని వదిలేసింది డ్రోన్. ఫుడ్ పార్సిల్ కిందపడటంతో కాకి అక్కడినుంచి మెల్లగా జారుకుంది.

Read More : Airbus : 56 విమానాల కొనుగోలు కోసం..ఎయిర్‌బస్ తో కేంద్రం మెగా డీల్

ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఈ దాడిలో పక్షికి ఏమి కాలేదని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో డ్రోన్‌లు తిరగపోవడం వల్ల దాన్ని తరిమి కొట్టడంలో పక్షి విజయవంతమైందని పక్షుల సంరక్షణ నిపుణుడు ఒకరు చెప్పారు.