Anju renamed Fatima : పాక్ నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చి పిల్లల్ని కలిసిన అంజూ…కొత్త ట్విస్ట్

పాకిస్థానీ ఫేస్‌బుక్ స్నేహితురాలిని పెళ్లాడిన అంజూ ఎట్టకేలకు ఢిల్లీలో తన పిల్లలను కలుసుకుంది. పాకిస్థాన్‌లో అంజూ ఇస్లాం మతంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకుంది....

Anju

Anju renamed Fatima : పాకిస్థానీ ఫేస్‌బుక్ స్నేహితురాలిని పెళ్లాడిన అంజూ ఎట్టకేలకు ఢిల్లీలో తన పిల్లలను కలుసుకుంది. పాకిస్థాన్‌లో అంజూ ఇస్లాం మతంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకుంది. అంజూ అనే 35 ఏళ్ల మహిళ రాజస్థాన్‌లోని తన ఇంటిని విడిచిపెట్టి, తన ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లాను వివాహం చేసుకోవడానికి పాకిస్థాన్‌కు వెళ్లింది. ఇటీవలే భారతదేశానికి తిరిగి వచ్చి, చివరకు తన పిల్లలను కలుసుకుంది.

ALSO READ : Covid cases : పలు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు

తన 15 ఏళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడిని ఢిల్లీలో కలిసిన అంజూ తన భవిష్యత్ జీవితంపై మాట్లాడింది. తాను ప్రస్థుతం ఢిల్లీలో అద్దెకు ఉంటున్నానని, త్వరలో తాను ఇక్కడే కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నానని అంజూ పేర్కొంది. భిల్వారాకు చెందిన అంజూ పాక్ వెళ్లి నస్రుల్లాను వివాహం చేసుకొని ఢిల్లీకి తిరిగివచ్చింది. తన పిల్లల కోసం తాను పాకిస్థాన్ నుంచి భారతదేశానికి తిరిగివచ్చానని, తన పిల్లలిద్దరూ సంతోషంగా ఉన్నారని అంజూ చెప్పారు.

ALSO READ : Today Headlines: నేడు బీఆర్ఎస్ స్వేద పత్రం .. జనవరి 19న నాలుగు రాజ్యసభ సీట్లకు ఎన్నిక

తన కొత్త భర్త నస్రుల్లా త్వరలో భారత్‌కు రాబోతున్నట్లు కూడా ఆమె వెల్లడించారు. ‘‘నస్రుల్లా నాకు పాకిస్థాన్‌ను చూపించాడు, నేను కూడా అతనికి భారత్‌ను చూపించాలనుకుంటున్నాను’’ అని అంజూ తెలిపింది. తన భర్త అరవింద్ కు విడాకుల విషయం ఆలోచిస్తానని చెప్పారు. తన పిల్లలతో కలిసి సమయాన్ని సంతోషంగా గడుపుతున్నానని అంజూ చెప్పారు.

ALSO READ : Vaikunta Ekadasi 2023 : తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి శోభ.. వైష్ణవ ఆలయాలకు పోటెత్తిన భక్తులు .. తిరుమలకు క్యూ కట్టిన వీఐపీలు

తాను భిల్వారాకు వెళ్లి తన పత్రాలన్నీ తీసుకొని వచ్చి తన పిల్లల కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలనుకున్నానని ఆమె పేర్కొన్నారు. వాఘా సరిహద్దు మీదుగా భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అంజూ పంజాబ్ పోలీసు గూఢచార బృందం, అమృత్‌సర్‌లోని ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రశ్నించింది. ఆ తర్వాత అంజూకు ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.