Covid cases : పలు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు

దేశంలోని పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, గుజరాత్, తెలంగాణ, పంజాబ్,ఢిల్లీ ప్రాంతాల్లో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ రోగుల చికిత్స కోసం ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు......

Covid cases :  పలు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన కొవిడ్ కేసులు

Covid cases

Covid cases : దేశంలోని పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, గుజరాత్, తెలంగాణ, పంజాబ్,ఢిల్లీ ప్రాంతాల్లో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ రోగుల చికిత్స కోసం ప్రత్యేక వార్డును సిద్ధం చేశారు. కొవిడ్ జేఎన్ 1 కొత్త వేరియంట్ వ్యాప్తితో అన్ని రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. కొవిడ్ పరీక్షల కోసం నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశించింది.

ALSO READ : CM Jagan : జగన్ సంచలన నిర్ణయాలు.. అసలు వ్యూహం ఏంటి? గెలుపుపై అంత ధీమా ఎలా?

కొవిడ్ నివారణకు అన్నీ రాష్ట్రాలు కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తున్నాయి. కొవిడ్ రోగుల్లో 93 శాతం మందికి తేలికపాటి లక్షణాలున్నాయి. ఆసుపత్రుల్లో 1 శాతం మంది మాత్రమే వెంటిలేటర్ సపోర్టులో ఉన్నారు. 1.2 శాతం మంది రోగులు ఐసీయూలో, 0.6 శాతం రోగులు ఆక్సిజన్ సపోర్టులో ఉన్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కొవిడ్ జేఎన్ 1 కొత్త వేరియంట్ వల్ల ప్రజారోగ్యానికి ఎక్కువ ప్రమాదం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.

ALSO READ : VV Lakshmi Narayana : ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ.. నా లక్ష్యం అదే అంటున్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం 27 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 1245 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, వారిలో 68 మంది నమూనాల పరీక్షలు పెండింగులో ఉన్నాయి. గురుగ్రామ్ నగరంలో కొవిడ్ కొత్త వేరియంట్ రెండవ కేసు నమోదైంది. 42 ఏళ్ల మహిళకు శుక్రవారం కోవిడ్-పాజిటివ్ పరీక్షలు చేసినట్లు ఆరోగ్య అధికారి తెలిపారు. రాజస్థాన్‌లో కొవిడ్ -19 సంక్రమణకు సంబంధించిన ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్ రాష్ట్రంలో 683 మంది నమూనాలను పరీక్ష కోసం పంపించారు.

ALSO READ : Today Headlines: తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి శోభ.. తెలంగాణలో 28 నుంచి రేషన్ దరఖాస్తులకు ఆహ్వానం!

రాజస్థాన్ రాష్ట్రంలో కొవిడ్ తో ఒకరు మరణించారు. కొవిడ్ జేఎన్ 1 సబ్ వేరియంట్ వల్ల ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ చెప్పారు. కేరళలో 265 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ అదుపులోనే ఉందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ చెప్పారు.