భారత కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మరో 118 చైనా సంబంధిత యాప్‌లను బ్యాన్ చేసింది. పాపులర్ మొబైల్ గేమ్ PUBGతో సహా.. Tencent, Baidu, Xiaomi ప్లాట్ ఫాంల నుంచి తొలగించేసింది. దక్షిణ కొరియా ప్రోడక్ట్ డెవలపర్ ఇండియా వ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఒకరైన Tencent గేమ్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అయింది.
సెన్సార్ టవర్ లెక్కలను బట్టి.. ఇండియాలో 175 మిలియన్ ఇన్‌స్టాల్స్ జరిగాయట. దాని నుంచి నెలకు 3మిలియన్ డాలర్లు సంపాదిస్తుంది. ఈ యాప్ లు భారత సార్వభౌమత్యంతో పాటు సమగ్రతకు పక్షపాతంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ నెలలో ఇండియా 59 యాప్ లు నిషేదించింది.
https://10tv.in/csk-star-suresh-raina-out-of-ipl-2020-returns-to-india-due-to-personal-reasons-2/
గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల కారణంగా.. మరో 47యాప్ లను తొలగించారు. చైనా చట్ట ప్రకారం.. కస్టమర్ల డేటాను ఇంటిలిజెన్స్ ఏజెన్సీతో పంచుకోవాలి. అది ఏ దేశంలో ఉన్నవారు వాడుతున్నప్పటికీ పద్ధతి మాత్రం ఒకటే.