Vladimir Putin Health: పుతిన్ ఆరోగ్యంపై మరోసారి చర్చ.. మార్చిలో చికిత్సకు సిద్ధమవుతున్నట్లు కథనాలు ..

ది మిర్రర్ నివేదిక ప్రకారం .. గతవారం పుతిన్ తన అనారోగ్య సమస్యకు చికిత్స తీసుకున్నాడని, కానీ అది ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోవటంతో మార్చి 5 నుంచి మరోసారి చికిత్స తీసుకొనేందుకు సిద్ధమవుతున్నాడని నివేదిక పేర్కొంది.

Vladimir Putin Health: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని గతకొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం విధితమే. గతంలో ఆయన రహస్య ప్రాంతంలో చికిత్స తీసుకున్నాడన్న ప్రచారం జరిగింది. తాజా అతని ఆరోగ్యంపై మరోసారి చర్చ జరుగుతుంది. 70ఏళ్ల పుతిన్ మార్చి ప్రారంభంలో తన అనారోగ్య సమస్యకు కొత్త చికిత్సను ప్రారంభించబోతున్నాడని ది మిర్రర్ నివేదించింది. అయితే, పుతిన్ క్యాన్సర్‌తో సహా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని గతంలో పేర్కొన్న రష్యన్ టెలిగ్రామ్ ఛానెల్ జనరల్ ఎస్వీఆర్‌ను తన నివేదికలో ఉటంకించింది.

Putin’s Health: పుతిన్ ఆరోగ్యంపై మళ్లీ వదంతులు

ది మిర్రర్ నివేదిక ప్రకారం .. గతవారం పుతిన్ తన అనారోగ్య సమస్యకు చికిత్స తీసుకున్నాడని, కానీ అది ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోవటంతో మార్చి 5 నుంచి మరోసారి చికిత్స తీసుకొనేందుకు సిద్ధమవుతున్నాడని నివేదిక పేర్కొంది. అయితే ఈ చికిత్స సమయంలో పుతిన్ పాలనకు సంబంధించిన ప్రణాళికలు, నిర్ణయాలను పంచుకోవటంలో దూరమయ్యే అవకాశం ఉందని, పనిలో పనిలో ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెన్, రష్యా యుద్ధం విషయంలో నిర్ణయాలు తీసుకోవటంలోనూ ఆయన కొంతకాలం దూరంగా ఉండాల్సి రావచ్చని ది మిర్రర్ నివేదిక అంచనా వేసింది.

Russia President Putin: యుక్రెయిన్‌పై యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది.? క్లారిటీ ఇచ్చిన పుతిన్

గత సంవత్సరంలో పుతిన్ చికిత్స సమయంలో అనేక కీలక కార్యక్రమాలనుసైతం రద్దు చేసుకోవాల్సి వచ్చిందని, ప్రస్తుతం కూడా చికిత్స సమయంలో కీలక అంశాల విషయంలో పుతిన్ దూరంగా ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే, గత రెండు రోజుల క్రితం అమెరికా ప్రెసిడెంట్ ముందస్తు సమాచారం లేకుండానే ఉక్రెయిన్ లో పర్యటించి ప్రపంచ దేశాలను ఆశ్చర్య పర్చాడు. ఈ క్రమంలో రష్యా నుంచి కీలక ప్రకటనలు వెలువడనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం దేశ ప్రజలు ఉద్దేశించి పుతిన్ మాట్లాడతారని, రెండో ఏడాదికి యుద్ధం లక్ష్యాలను నిర్దేశించేలా ఈ ప్రసంగం ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది.

ట్రెండింగ్ వార్తలు