Russia President Putin: యుక్రెయిన్‌పై యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది.? క్లారిటీ ఇచ్చిన పుతిన్

మాస్కోలో మీడియాతో పుతిన్ ముచ్చటించారు. యుద్ధం ముగింపు దశకు వచ్చిందని నిర్ధారించుకోవటానికి యత్నిస్తున్నామని తెలిపారు. దీనిని త్వరలోనే ముగిస్తాం. ప్రతి సక్షోభం ఏదో రకంగానో, చర్చల ద్వారానో పరిష్కారం అవుతుంది. ఈ విషయాన్ని కీవ్ లోని మా ప్రత్యర్థులు అర్థం చేసుకోవాలి అంటూ పుతిన్ పేర్కొన్నారు.

Russia President Putin: యుక్రెయిన్‌పై యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది.? క్లారిటీ ఇచ్చిన పుతిన్

Russia president putin

Russia President Putin: యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా సైన్యం మిసైళ్లతో యుక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై విరుచుకుపడుతుంది. బాంబుల మోతతో ఆ దేశంలోని ప్రాంతాలు దద్దరిల్లిపోతున్నాయి. పలుసార్లు రష్యా సైన్యం తమ దాడులను ఆపినప్పటికీ మళ్లీ కొనసాగిస్తూనే ఉంది. దీంతో ఇరుదేశాల మధ్య సుదీర్ఘకాలంగా సాగుతున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే ప్రశ్న ప్రపంచ వ్యాప్తంగా ఉత్పన్నమవుతోంది. ఇదేవిషయాన్ని విలేకరులు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ప్రశ్నించారు. పుతిన్ సమాధానం ఇస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Russian President Putin: పుతిన్ ఆరోగ్యంపై ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చర్చ.. ఆయన చేతులు నిజంగానే రంగు మారాయా?

మాస్కోలో మీడియాతో పుతిన్ ముచ్చటించారు. యుద్ధం ముగింపు దశకు వచ్చిందని నిర్ధారించుకోవటానికి యత్నిస్తున్నామని తెలిపారు. దీనిని త్వరలోనే ముగిస్తాం. ప్రతి సక్షోభం ఏదో రకంగానో, చర్చల ద్వారానో పరిష్కారం అవుతుంది. ఈ విషయాన్ని కీవ్ లోని మా ప్రత్యర్థులు అర్థం చేసుకోవాలి. అదే వారికి మంచిదని గుర్తుంచుకోవాలి అంటూ పరోక్షంగా యుక్రెయిన్ ప్రెసిడెంట్ జలెన్ స్కీని ఉద్దేశించి పుతిన్ వ్యాఖ్యానించారు. పనిలోపనిగా అమెరికాలో యుక్రెయిన్ ప్రెసిడెంట్ జలెన్ స్కీ పర్యటనపైనా, యుక్రెయిన్‌కు పేట్రియాట్ వ్యవస్థలను అమెరికా సమకూర్చడంపైనా పుతిన్ స్పందించారు.

Russia vs Ukraine War: యుక్రెయిన్ రాజధాని కీవ్‌పై మరోసారి క్షిపణులతో విరుచుకుపడ్డ రష్యా ..

మాతో తలపడుతున్న వారికి నేను ఒక్కటే చెప్పదల్చుకున్నా. పేట్రియాట్ వ్యవస్థ అదో రక్షణాత్మక ఆయుధం. దానికి విరుగుడు ఉంటుంది. ఇది సంక్షోభాన్ని మరింత పెంచుతుందేకానీ, తగ్గించదు అంటూ పుతిన్ వ్యాఖ్యానించారు. ఇదిలాఉంటే గురువారం యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఘన స్వాగతం లభించింది. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్‌తో భేటీ అయ్యారు. అయితే జలెన్ స్కీ అమెరికా వెళ్లడానికి ముందే దాదాపు 1.8 బిలియన్ డాలర్ల విలువైన సైనిక సామాగ్రిని యుక్రెన్ కు అందించిన విషయం తెలిసిందే.