Earthquake
Earthquake : అఫ్ఘానిస్థాన్ దేశంలో బుధవారం మళ్లీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ తెలిపింది. బుధవారం తెల్లవారుజామున 6.11 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చింది. అప్ఘానిస్థాన్ దేశంలో గత శనివారం సంభవించిన భూకంపం వల్ల 4 వేలమంది మరణించారని తాలిబన్ అధికారులు చెప్పారు. భారీభూకంపం వల్ల పలు భవనాలు నేలకూలాయి. 20 గ్రామాల్లో 1983 నివాస భవనాలు నేలకూలాయి.
Also Read :Israel war : ఇజ్రాయెల్ చేరిన అమెరికా ఆయుధ విమానం…యుద్ధంలో 3వేలమంది మృతి
హెరాత్ నగరానికి ఉత్తరాన 29 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. శనివారం నాటి భూకంపాల తర్వాత తన తల్లితో సహా 12 మంది బంధువులను కోల్పోయానని 40 ఏళ్ల మహ్మద్ నయీమ్ చెప్పారు. భూకంపం అనంతరం హెరాత్ నివాసితులు రాత్రివేళల్లో బహిరంగ ప్రదేశంలోని గుడారాలలో గడుపుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తరచుగా ఘోరమైన భూకంపాలతో దెబ్బతింది.
Also Read :Mexico : మెక్సికోను వణికిస్తున్న లిడియా హరికేన్
తాజా భూప్రకంపనల కారణంగా ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు వార్తలు అందలేదు. ఐక్యరాజ్యసమితి యొక్క మానవతా కార్యాలయం భూకంప ప్రతిస్పందన కోసం 5 మిలియన్ డాలర్ల విలువైన సహాయాన్ని ప్రకటించింది.