Viral News: అర్జెంటీనా జైల్లో ఖైదీని ముద్దాడిన మహిళా జడ్జి

సభ్యసమాజం తలదించుకునేలా.. ఒక యావజ్జివ ఖైదీతో ఓ మహిళా జడ్జి ముద్దులాడింది. ఈఘటన దక్షిణ అమెరికా ఖండంలోని అర్జెంటీనా దేశంలో చోటుచేసుకుంది.

Viral News: సభ్యసమాజం తలదించుకునేలా.. ఒక యావజ్జివ ఖైదీతో ఓ మహిళా జడ్జి ముద్దులాడింది. ఈఘటన దక్షిణ అమెరికా ఖండంలోని అర్జెంటీనా దేశంలో చోటుచేసుకుంది. ఈదృశ్యాలు జైలు గదిలోని సీసీకెమెరాలో రికార్డు కాగా, వాటిని జైలు సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆదృశ్యాలు వైరల్ అవడంతో మహిళా జడ్జి మరియెల్ సువారెజ్ పై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. క్రిస్టియన్ ‘మై’ బస్టోస్ అనే వ్యక్తి.. 2009లో ఒక పోలీస్ అధికారిని కాల్చిచంపాడు. అప్పటి నుంచి ఈ కేసును విచారిస్తున్న న్యాయవాదులు ఇటీవల బస్టోస్ కు యావజ్జివ కారాగార శిక్ష విధించారు.

Also read: Sony Earphones: సోనీ నుంచి తక్కువ ధరలో వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్

బస్టోస్ పై జరుగుతున్న విచారణలో పాల్గొన్న న్యాయవాదుల బృందంలో మహిళా న్యాయవాది మరియెల్ సువారెజ్ కూడా ఒకరు. స్థానికంగా నరరూప రాక్షసుడిగా పేరున్న బస్టోస్ కు న్యాయవాదుల బృందం యావజ్జివ శిక్ష విధించకుండా మరియెల్ సువారెజ్ ఒక్కరే వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం. అయితే..బస్టోస్ పై పుస్తకం రాస్తున్న సువారెజ్.. అందుకోసం అతన్ని జైలు గదిలో ఏకాంతంగా కలిసేందుకు అనుమతులు తీసుకుంది. జడ్జిగా ముందుగానే అనుమతులు తీసుకున్న ఆమెను జైలు సిబ్బంది బస్టోస్ జైలు గదిలోనికి పంపించారు. అనంతరం అతని గురించి వివరాలు సేకరిస్తున్న సువారెజ్.. ఒక్కసారిగా ఖైదీని ముద్దుపెట్టుకుంది. అనంతరం సువారెజ్ తనదారిన తాను వెళ్లిపోయింది.

Also read: Mothers Love: తల్లికి మాటల్లో చెప్పలేని సంతోషాన్ని అందించిన కొడుకు

అయితే ఈ దృశ్యాలు జైలుగదిలోని సీసీకెమెరాలో రికార్డు కాగా, జైలు అధికారులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో మహిళా జడ్జి సువారెజ్ చర్యపై విచారణ జరపాలంటూ అర్జెంటీనా ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. అయితే హత్యానేరం శిక్ష అనుభవిస్తున్న క్రిస్టియన్ ‘మై’ బస్టోస్ తో తనకు ఎటువంటి సంబంధం లేదని, కేవలం అతని కేసుపై పుస్తకం రాసేందుకే జైలు గదికెళ్లి ఒంటరిగా కలిశానని సువారెజ్ చెప్పుకొచ్చారు. అతనితో ఎటువంటి సంబంధం పెట్టుకోవడానికి తాను సిద్ధంగా లేనని ఆమె తెలిపింది.

Also read: Millionaire Pigeons: పావురాల పేరుమీద కోట్ల రూపాయల ఆస్తులు, మన ఇండియాలోనే

ట్రెండింగ్ వార్తలు