Millionaire Pigeons: పావురాల పేరుమీద కోట్ల రూపాయల ఆస్తులు, మన ఇండియాలోనే

తమవికానీ పావురాలకు ఆస్తులు రాసేస్తున్నారు ఆ పట్టణ వాసులు. లక్షల రూపాయల నగదు డిపాజిట్లు, భూములు, ఇళ్ల పట్టాలు ఇలా అనేక ఆస్తులను పావురాలకు రాసిచ్చారు.

Millionaire Pigeons: పావురాల పేరుమీద కోట్ల రూపాయల ఆస్తులు, మన ఇండియాలోనే

Pigeoans

Updated On : January 11, 2022 / 6:42 PM IST

Millionaire Pigeons: పెంపుడు జంతువులకు, అనాధాశ్రమాలకు ఆస్తులు రాసిచ్చే ఘటనలు మనం తరచూ వింటూనే ఉన్నాం. కానీ తమవికానీ పావురాలకు ఆస్తులు రాసేస్తున్నారు ఆ చిరు పట్టణ వాసులు. అది కూడా లక్షల రూపాయల నగదు డిపాజిట్లు, భూములు, ఇళ్ల పట్టాలు ఇలా అనేక ఆస్తులను పావురాలకు రాసిచ్చారు. రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లాలోని జసనగర్ అనే చిన్న పట్టణంలో ఉండే పావురాల ఆస్తుల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. జసనగర్ పట్టణంలో చాలా ఏళ్ల క్రితం నుంచి పావురాలు నివసిస్తున్నాయి. ఇక్కడి పావురాలను పోషించేందుకు ఏకంగా ఒక ట్రస్ట్ ను నెలకొల్పారు. వాటి పోషణ, సంరక్షణ నిమిత్తం తమ వద్దనున్న ఆస్తులను, భూములను, నగదును పావురాల ట్రస్టుకు రాశారు కొందరు వ్యక్తులు.

Also read: Weird Food: బాతు తలను యధాతధంగా వండి వడ్డించిన రెస్టారెంట్

అలా ఇప్పటివరకు ఈపావురాలపై 126 బిఘాల స్థలం, 27 షాపులు 30 లక్షల రూపాయల నగదు సహా 400 వందల గోశాలలు ఈ పావురాలపై ఉన్నాయి. గోశాలల నిర్వహణ కోసం ఉపయోగించే భూములు సైతం పావురాలకే చెందినవి. 27 షాపుల నుంచి నెలకు రూ.80,000 వరకు అద్దెలు వస్తుండగా, భూములపైనా కొంత అద్దె వస్తుంటుంది. ఇవేకాక పావురాల ట్రస్ట్ ఏర్పాటు చేసిన నాటి నుంచి గత 40 ఏళ్లుగా బ్యాంకు డిపాజిట్ల రూపంలో మరో రూ.30 లక్షల రూపాయలు పోగయ్యాయి. ఈమొత్తం విలువ సుమారు రూ.రెండు కోట్లు ఉంటుందని అంచనా.

Also read: Only Fans : ఐలాండ్ లో ఎంజాయ్ చేస్తు లక్షలు సంపాదించిన జంట కాన్సెప్ట్ భలేగుందే..

పావురాల కోసం ఇంత ఆస్తులు ఎందుకు ఇస్తున్నారు? అనేగా మీ డౌట్. పావురాలకు ఆస్తులు రాయడం అనేది ఇక్కడ ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. స్థానికుల కథనం మేరకు దాదాపు నలభై ఏళ్ల క్రితం జసనగర్ ప్రాంతంలో పరిశ్రమలను నెలకొల్పేందుకు వచ్చిన, ఒక వ్యక్తి తమ పూర్వీకులను ఆదర్శంగా తీసుకుని పావురాలను సాకేవాడు. వాటి కోసం ఆహారపు గింజలు, త్రాగు నీరు అందించేవాడు. అలా అతని నుంచి మరొకరు ఆదర్శంగా ముందుకువచ్చి పావురాల కోసం ఆహారం సరఫరా చేసేవారు.

అయితే రోజులు గడిచేకొద్దీ పావురాల సంఖ్య కూడా పెరుగుతుండడంతో.. జసనగర్ ప్రజలంతా కూడబలుక్కుని పావురాల ఆహారం కోసం తోచినంత ఇచ్చేవారు. అలా వచ్చిన సొమ్ముని.. సజ్జనరాజ్ జైన్ అనే వ్యక్తి “కబుతరన్ ట్రస్ట్”(పావురాల ట్రస్ట్) అని ట్రస్ట్ ఏర్పాటు చేసి సమయానికనుగుణంగా వాటికీ ఆహారం అందించే విధంగా ప్రణాళిక వేశారు. అలా సంవత్సరాలుగా పావురలపై కోట్ల రూపాయల ఆస్తులు పోగయ్యాయి. దీంతో ఈ పట్టణంలోని పావురాలని లక్షాధికారి పావురాలు అని పిలుస్తున్నారు. మరి ట్రస్ట్ లో ఏమైనా పొరపచ్చాలు ఉండవా అంటే.. ఉండవనే చెబుతున్నారు జసనగర్ ప్రజలు. ట్రస్ట్ ఆధ్వర్యంలో చేసే రాబడి ఖర్చుల వివరాలను ఎప్పటికప్పడూ దాతలకు చేరవేస్తుంటారు ట్రస్ట్ సభ్యులు.

Also read: Smart Zoom Lens: మొట్టమొదటిసారిగా స్మార్ట్ ఫోన్స్ కోసం “లెన్స్” తెచ్చిన “TECNO”