Only Fans : ఐలాండ్ లో ఎంజాయ్ చేస్తు లక్షలు సంపాదించిన జంట కాన్సెప్ట్ భలేగుందే..

ఓ జంట సోషల్ మీడియాను వాడుకుని ఓపక్క ఐలాండ్ లో ఎంజాయ్ చేస్తు మరోపక్క లక్షల రూపాయలు సంపాదించారు. ఎంజాయ్ చేయటానికి వెళితే డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ వీళ్ల కాన్సెప్ట్ భలేగుందే..

Only Fans : ఐలాండ్ లో ఎంజాయ్ చేస్తు లక్షలు సంపాదించిన జంట కాన్సెప్ట్ భలేగుందే..

Only Fans

Only Fans : సోషల్ మీడియా డబ్బులు సంపాదించొచ్చు. బద్నామ్ కూడా అవ్వొచ్చు.టాలెంట్ చూపించుకోవచ్చు..తేడా వస్తే తాట కూడా తీయించుకోవచ్చు. సోషల్ మీడియానో వాడుకునేదాన్ని బట్టి ఉంటుంది. ఓ జంట మాత్రం సోషల్ మీడియాను చక్కగా వాడుకుని ఓ పక్క ఐలాండ్ లో ఎంజాయ్ చేస్తు మరోపక్క లక్షల రూపాయలు సంపాదించుకున్నారు. ఎంజాయ్ చేయటానికి టూర్ వెళితే డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ ఈ జంట మాత్రం ఐలాండ్ లో చక్కగా ఎంజాయ్ చేస్తు దండిగా డబ్బులు సంపాదించుకున్నారు. ఈ కాన్సెప్ట్ ఏదో బాగుందే..ఎలా ? ఎలా?అని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త చదివేయాల్సిందే….

బ్రిటన్‌కు చెందిన హ్యారీ, బెక్కా అనే జంటకు ‘ఓన్లీ ఫ్యాన్స్’ అనే యాప్ ఓ ప్రాజెక్ట్ ఇచ్చింది. దాని సారాంశమేంటీ అంటే..వీరిద్దరు కలిసి ఓ ఐలాండ్‌లో సరదాగా ఎంజాయ్ చేయాలి. ఇక్కడో షరతు కూడా ఉందండోయ్..వీరిద్దరినీ మూడో కన్ను అంటే సీసీ కెమెరాలు 24 గంటలు పర్యవేక్షిస్తుంటాయి. వాటి కన్నునుంచి వీరు తప్పించుకోలేదు. అంటే దాదాపు బిగ్ బాస్ లాగా అన్నమాట. ఆ జంట తాము ఎంజాయ్ చేసిన బెస్ట్ మూమెంట్స్‌ ఫోటోల్ని..వీడియోలను సదరు యాప్ ప్రాజెక్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. అలా హ్యారీ, బెక్కా జంట ఫోటోలు..వీడియోలను పోస్టు చేశారు. అంతే ఇంకేముంది లక్షల్లో లైకులు, వ్యూస్ కుప్పల్లా వచ్చిపడ్డాయి.

ఇది అసలే సోషల్ మీడియా హవా..ఎక్కువ వ్యూస్, లైక్స్ వస్తే.. డబ్బు దానంతట అవే వచ్చి పడతాయనే విషయం తెలిసిందే. అలా ఒక్క నెలలోనే ఈ జంట ఏకంగా 14,000 పౌండ్లు.. మన కరెన్సీలో అక్షరాలా రూ. 14 లక్షలు సంపాదించింది. దీని గురించి బెక్కా మాట్లాడుతు.. తమకు వచ్చిన డబ్బు ద్వారా తాము ఇప్పుడు హైక్లాస్ లైఫ్ స్టైల్‌ను ఎంజాయ్ చేస్తున్నామని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆ వీడియోలు ఏంటీ అనేది పెద్ద ప్రశ్నే..