Weird Food: బాతు తలను యధాతధంగా వండి వడ్డించిన రెస్టారెంట్

వెస్ట్రన్స్ లాండ్రీ హోటల్ లో ఇటీవల "స్టఫడ్ డక్"(Stuffed Duck) అనే వంటకాన్ని వడ్డించారు. హోటల్ పేరే విచిత్రంగా ఉన్న ఇందులో వారు ఇటీవల వడ్డించిన ఒక వంటకం కూడా వింతగానే ఉంది

Weird Food: బాతు తలను యధాతధంగా వండి వడ్డించిన రెస్టారెంట్

Duck

Weird Food: పాశ్చాత్య దేశాల్లో వంటకాలు రానురాను కొత్తపోకడలకు పోతుంది. భోజన ప్రియులను ఆకర్శించేందుకు వింతైన వంటకాలు తయారు చేస్తున్నారు రెస్టారెంట్ యజమానులు. అలా వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఓకే కొత్తరకమైన వంటకాన్ని సిద్ధం చేసింది లండన్ కు చెందిన వెస్ట్రన్స్ లాండ్రీ అనే రెస్టారెంట్. హోటల్ పేరే విచిత్రంగా ఉన్న ఇందులో వారు ఇటీవల వడ్డించిన ఒక వంటకం కూడా వింతగానే ఉందంటున్నారు నెటిజన్లు. వెస్ట్రన్స్ లాండ్రీ హోటల్ లో ఇటీవల “స్టఫడ్ డక్”(Stuffed Duck) అనే వంటకాన్ని వడ్డించారు. బాగా పొడవాటి తల ఉన్న బాతును చంపి, తల లోపలి భాగంలోని మాంసాన్ని తొలగించి మిగిలిన గొట్టం వంటి భాగంలో పప్పులు, ఇతర మాంసం ముక్కలు కుక్కి కిందభాగాన్ని తాడుతో మూసివేస్తారు.

Also read: Smart Zoom Lens: మొట్టమొదటిసారిగా స్మార్ట్ ఫోన్స్ కోసం “లెన్స్” తెచ్చిన “TECNO”

అనంతరం దాన్ని పొయ్యిమీద ఉడికించి వినియోగదారులకు వడ్డిస్తారు. సాధారణంగా తల ముందువెనుకా కత్తిరించి రెండు వైపులా తాడుతో మూసివేస్తారు. కానీ వెస్ట్రన్స్ లాండ్రీ రెస్టారెంట్ లో బాతు తలను కింది భాగంలో మాత్రమే కత్తిరించి.. ముక్కు భాగాన్ని యధావిదిగా ఉంచి వంటకాన్ని సిద్ధం చేశారు. ఇక ఈ వంటకాన్ని ఫోటో తీసిన ఒక వ్యక్తి దాన్ని ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నాడు. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవగా.. హోటల్ తీరుపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందిస్తున్నారు. “వావ్ ఇది రుచిగా ఉండి ఉంటుందని” ఒకరు కామెంట్ చేయగా.. ఇలా కాల్చుకు తినడం మనిషి క్రూరత్వానికి నిదర్శనం అంటూ మరొకరు కామెంట్ చేశారు.

Also read: Gandhi Hospital: గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో సిబ్బందికి, విద్యార్థులకు కరోనా

“ఇది కొంచెం అతి అయిందంటూ” ఒకరు కామెంట్ చేయగా.. “ఇది చూస్తుంటే జీవితంలో మాంసాహారాన్ని తినకూడదని నిశ్చయించుకున్నాను” అంటూ మరొకరు కామెంట్ చేశారు. అయితే దీనిపై వెస్ట్రన్స్ లాండ్రీ హోటల్ స్పందిస్తూ “జంతువుల మాంసాన్ని మొత్తంగా వినియోగించి, ఒకరికి ఆహారంగా మారిన ఆ జంతువులను గౌరవిస్తున్నామని, అంతే కాకుండా జంతువుల మాంసంలో చాల భాగం వ్యర్ధాల రూపంలో పోకుండా అరికడుతున్నామంటూ” చెప్పుకొచ్చింది.

Also read: Mumbai Bomb Threat: ముంబైలో పలుచోట్ల ఉగ్రదాడులంటూ ఫోన్ చేసిన వ్యక్తి అరెస్ట్