Flights Cancelled : ఫ్లైట్‌‌లు కదలడంలేదు..! 12 వేల విమానాలు రద్దు

ఒమిక్రాన్ వేరియంట్ తో పౌర విమానయాన రంగానికి కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ విస్తరిస్తోన్న నేపథ్యంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు, నిషేధం విధిస్తున్నాయి.

Omicron Spreads : విమానాలు కదలడంలేదు..! విమాన రెక్కలు విరిగిపోయాయి..! అవును..! ప్రయాణం ఇప్పుడొక పీడకలలా మారిపోయింది..! ఎందుకంటే అంత‌ర్జాతీయ‌ రవాణా దాదాపు స్తంభించిపోయింది..! చరిత్ర ఎన్నడూ చూడని విధంగా వేలకొద్దీ విమానాలు ఆకస్మికంగా రద్దవుతున్నాయి..! కరోనా దెబ్బకు విమానయానరంగం మరోసారి కుదేలవుతోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎంట్రీతో సీన్‌ ఒక్కసారిగా మారిపోయింది. అమెరికా, యూరోప్‌లలో ఏ ఎయిర్‌పోర్టు చూసినా ప్రయాణికుల పడిగాపులే కనిపిస్తున్నాయి. క్రిస్మస్‌, న్యూఇయర్‌ సీజన్‌ కావడంతో తమ కుటుంబసభ్యులకు కలుద్దామంటూ ఎయిర్‌పోర్టుకు క్యూ కడుతున్న వారికి నిరాశే ఎదురవుతోంది.

Read More : Centurion Test : భారత్ 327 ఆలౌట్..ఎంగిడి విశ్వరూపం

ఫ్లైట్‌ ఎక్కి రయ్‌ రయ్‌మంటూ గాల్లో వెళ్లిపోదామని ఎయిర్‌పోర్టుకు వెళ్తే నేలపై కూర్చునే విధంగా పరిస్థితులు మారిపోయాయి. ఎప్పుడు ఏ నిమిషంలో ఏ ఫ్లైట్‌ రద్దవుతుందో తెలియని పరిస్థితి దాపరించింది. ఒమిక్రాన్ వేరియంట్ తో పౌర విమానయాన రంగానికి కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ విస్తరిస్తోన్న నేపథ్యంలో విమాన ప్రయాణాలపై ఆంక్షలు, నిషేధం విధిస్తున్నాయి.

Read More : Procurement Of Grain : తెలంగాణ నుంచి ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణను పెంచిన కేంద్రం

అనేక దేశాలు గత శుక్రవారం నుంచి ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 12వేల విమానాలు రద్దయినట్లు ‘ఫ్లైయిట్‌అవేర్‌’ సంస్థ వెల్లడించింది. భవిష్యత్ లో ఇంకా వేలకొద్ది విమానాలు రద్దయ్యే అవకాశాలున్నాయని, మరికొన్ని వాయిదా పడనున్నాయని తెలిపింది. సోమవారం ఒక్క రోజే 3 వేల విమానాలు రద్దు కాగా.. మంగళవారం వెయ్యికిపైగా విమాన ప్రయాణాలు రద్దయ్యాయి. విమానాశ్రయ సిబ్బంది విధులకు హాజరయ్యేందుకు విముఖుత చూపుతుండటంతో విమాన సేవల రద్దు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు