Centurion Test : భారత్ 327 ఆలౌట్..ఎంగిడి విశ్వరూపం

మంగళవారం ఆట ప్రారంభించిన కొద్దిసేపటికే సౌతాఫ్రికా బౌలర్ ఎంగిడి ధాటికి భారత బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు. అతను అత్యధికంగా ఆరు వికెట్లు తీయడం విశేషం...

Centurion Test : భారత్ 327 ఆలౌట్..ఎంగిడి విశ్వరూపం

Bumra

India VS South Africa 1st Test : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 327 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు వర్షం కారణంగా..ఆట రద్దు అయ్యింది. మంగళవారం ఆట ప్రారంభించిన కొద్దిసేపటికే సౌతాఫ్రికా బౌలర్ ఎంగిడి ధాటికి భారత బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు. అతను అత్యధికంగా ఆరు వికెట్లు తీయడం విశేషం.

Read More : New E-cycles from Hero: దేశంలోనే మొట్టమొదటిసారిగా బ్లుటూట్ తో వచ్చిన సైకిల్

ఆరంభంలోనే టీమిండియా రెండు కీలక వికెట్లను కోల్పోయింది. సెంచరీ సాధించి మంచి ఊపులో ఉన్న రాహుల్ 123 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఎంగిడీ బౌలింగ్ లోనే రహానే కూడా 48 వద్ద వెనుదిరిగాడు. బుమ్రా 14 పరుగులు చేయగా.. మిగతా బ్యాట్స్ మెన్స్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. మొత్తంగా 273/3 స్కోరుతో ఆటను ఆరంభించిన భారత్…కేవలం 55 పరుగులు మాత్రమే జోడించి మిగతా ఏడు వికెట్లను కోల్పోయింది. రబాడ 3, జాన్ సెన్ ఒక వికెట్ తీశారు.

Read More : Marriage Cheating : మ్యాట్రిమోనీ లో పరిచయం.. కొన్నాళ్లు సహజీవనం చేసి పరారైన వ్యక్తి

అనంతరం దక్షిణాఫ్రికా ఆటను ఆరంభించింది. మొదట్లోనే ఫస్ట్ వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్ లో ప్రొటిస్ కెప్టెన్ డీన్ ఎల్గర్ ఒకే పరుగు చేసి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్ ఆట కొనసాగించారు.