Marriage Cheating : మ్యాట్రిమోనీ లో పరిచయం.. కొన్నాళ్లు సహజీవనం చేసి పరారైన వ్యక్తి

పెళ్లి పేరుతో కొన్నాళ్లు సహజీవనం చేసి పరారైన వ్యక్తి ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. బాధిత మహిళ నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించింద

Marriage Cheating : మ్యాట్రిమోనీ లో పరిచయం.. కొన్నాళ్లు సహజీవనం చేసి పరారైన వ్యక్తి

Matrimony Cheating

Marriage Cheating :  పెళ్లి పేరుతో కొన్నాళ్లు సహజీవనం చేసి పరారైన వ్యక్తి ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది. బాధిత మహిళ నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించింది. పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యంతో హైదరాబాద్ కు చెందిన ఒక యువతి(30) మ్యాట్రిమోనీ వెబ్ సైట్‌లో తన పేరు రిజిష్టర్ చేసుకుంది. అది చూసి 2019 లో   ప్రముఖ ఫార్మా ల్యాబ్  లో సైంటిస్ట్ గా పని చేసే ఒక వ్యక్తి (37) ఇంటరెస్ట్ మెసేజ్ పంపించాడు.

ఇద్దరూ ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు. తాను ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తి చేసి… ఐఐసీలో ఇంటర్న్ షిప్ చేసి… పేరొందిన  ఫార్మా స్యూటికల్  ల్యాబ్స్  లో శాస్త్రవేత్తగా పని చేస్తున్నట్లు ఆవ్యక్తి చెప్పాడు. ఇద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకోవటంతో ఇంక పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. ఇరువైపులా ఇంట్లో పెద్దవారితో కూడా ఒప్పించుకున్నారు. దీంతో నాలుగు నెలలపాటు సహ జీవనం చేశారు.

ఈలోగా ఆయువతి తండ్రి మరణించటంతో కొన్నాళ్లు ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఆతర్వాత కరోనా వచ్చి లాక్ డౌన్ పరిస్ధితులు ఏర్పడటంతో ఆ దూరం మరింత పెరిగింది. లాక్ డౌన్ తర్వాత తనను కలిసినా… తనని మర్చిపోవాలని ఆవ్యక్తి కోరాడని బాధిత యువతి చెప్పింది. దాంతో యువతి   మియాపూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయటంతో   జీరో ఎఫ్ఐర్ నమోదు చేసి అమీన్ పూర్ పోలీసు స్టేషన్ కు పంపించారని ఆమె తెలిపింది.

Also Read : Maoists : చత్తీస్‌గఢ్ లో ఐఈడీ బాంబు పేల్చిన మావోయిస్టులు.. ముగ్గురు కూలీలకు గాయాలు

పోలీసులు పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వటంతో పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు. ఇది జరిగి నెలలు గడుస్తున్నా పెళ్ళి విషయం మాట్లాడక పోవటంతో పోలీసులు 420, 417 కింద కేసులు నమోదు చేశారు. దాంతో ఫోన్ నెంబర్లు మార్చి…తాను ఉంటున్న ఇల్లు కూడా మార్చి… ఉద్యోగానికి సెలవు పెట్టాడని బాధితురాలు వాపోయింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటోంది.